arangetram review : ‘అరంగేట్రం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

News Reviews Uncategorized

విడుదల తేదీ : మే 5 2023

తారాగణం : శ్రీనివాస్ ప్రబన్, ముస్తఫా అస్కారి, పూజా రెడ్డి బోరా, సాయి శ్రీ వల్లపాటి, అనిరుధ్ తుకుంట్ల, ఇంధు, శ్రీవల్లి, రోషన్ జెడ్, జబర్దస్త్ సత్తి పండు తదితరులు

దర్శకత్వం : శ్రీనివాస్ ప్రబన్

సంగీతం : గిడియన్ కట్టా

సినిమాటోగ్రఫీ : బురాన్ షేక్ (సలీమ్)

నిర్మాత : మహేశ్వరి కె

నిర్మాణ సంస్థ : ‘మహి మీడియా వర్క్స్’

ఈ వారం ‘రామబాణం’ ‘ఉగ్రం’ లతో పాటు ‘అరంగేట్రం’ అనే చిన్న సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. బహుశా ఈ విషయం అతి తక్కువ మందికి మాత్రమే తెలిసుంటుంది. ఈ చిత్రాన్ని తెరకెక్కించింది కాస్త నోటెడ్ డైరెక్టరే..! అతని పేరు శ్రీనివాస్ ప్రబన్. గతంలో ఇతను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ‘కవచం’ అనే సినిమా తీశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా అంటే వెనుక నుండి బెల్లంకొండ సురేష్ భారీగా పెట్టుబడి పెడతాడు కాబట్టి.. శ్రీనివాస్ ప్రబన్ మొదటి సినిమానే గ్రాండ్ స్కేల్ లో రూపొందింది. కాజల్, మెహ్రీన్ వంటి స్టార్లతో పాటు నీల్ నితిన్ ముకేశ్ వంటి బాలీవుడ్ స్టార్లు కూడా ఆ సినిమాలో నటించారు. కానీ ఆ సినిమా కనీసం వారం రోజులు కూడా ఆడలేదు. అది వేరే సంగతి. శ్రీనివాస్ కు మరో హీరో కూడా అవకాశం ఇచ్చింది లేదు. నిజానికి కళ్యాణ్ రామ్ వద్దనుకున్న సినిమా అది. ఇక ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వకపోవడంతో రెండో సినిమాకి శ్రీనివాస్ ప్రబన్ నటుడిగా కూడా చేయాల్సి వచ్చింది. ఇక ‘అరంగేట్రం’ సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

కథగా చెప్పుకోడానికి.. ఏమీ ఉండదు. ఓ సైకో ప్రతీ నెల కొంతమంది అమ్మాయిలను చంపేస్తూ ఉంటాడు. అతను ఎందుకు చంపుతాడు.? అతని వల్ల ఇబ్బంది పడింది.. నష్టపోయింది ఎవరు? చివరికి అతను ఎలా పట్టుబడ్డాడు? అనేది కథ.

థ్రిల్లర్ సినిమాలకు ట్విస్ట్ లు మాత్రమే ఉంటే సరిపోతుంది అనే భ్రమలో కొంతమంది టాలీవుడ్ దర్శకులు ఉన్నారు. అందులో శ్రీనివాస్ ప్రబన్ కూడా ఒకరు అని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యింది. తన మొదటి సినిమాలో కూడా అర్ధం పర్థం లేని ట్విస్ట్ లు పెట్టి.. కథని గాలికి వదిలేశాడు. రెండో సినిమాకి కూడా అతను ఇంప్రూవ్ అయ్యింది ఏమీ లేదు. థ్రిల్లర్ సినిమాలకు ట్విస్ట్ లు మాత్రమే కాదు .. గ్రిప్పింగ్ నేరేషన్ ఉండాలి, అసందర్భంగా కామెడీ రాకూడదు. ‘అరంగేట్రం’ లో అదే మైనస్ అయ్యింది. సైకో కాబట్టి.. అతను అమ్మాయిలను ఎందుకు చంపుతున్నాడు అనేదానికి బలమైన కారణం ఉండదు. ఇలాంటి సినిమాలకు నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ హైలెట్ అవ్వాలి. ఇక్కడ అది కూడా జరగలేదు. తక్కువ బడ్జెట్ లో సినిమాని తేల్చేయాలి అనుకునే నిర్మాత ఆరాటం కూడా కనిపించింది.

సో ఫైనల్ గా ‘అరంగేట్రం’ కి కూడా ‘కవచం’ వీడలేదు అని చెప్పొచ్చు.సో ఒక్క మాటలో చెప్పాలంటే హ్యాపీగా ఈ చిత్రాన్ని లైట్ తీసుకోవచ్చు.

రేటింగ్ : 1/5

Read more :ఫేడౌట్ అయిపోయిన హీరోయిన్ కు ‘ఎన్టీఆర్ 30’ లో ఛాన్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *