Chatrapathi :హిందీ ఛత్రపతి వల్ల రూ.100 కోట్లు నష్టమా.. పరువు తీసేసిన బెల్లంకొండ

News

టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన బెల్లంకొండ సురేష్.. పెద్ద కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘వాపు చూసి బలుపు అనుకున్నట్టు’ అనే సామెత ప్రకారం..  అతను నటించిన తెలుగు ప్లాప్ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ వచ్చాయని, దాంతో అతనికేదో హిందీలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందని భావించి…బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి ఇతను రెడీ అయిపోయినట్టు స్పష్టమవుతుంది. అనుకున్నట్టే హిందీలో ‘ఛత్రపతి’ రీమేక్ తో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 2005 లో రిలీజ్ అయిన ‘ఛత్రపతి‘ చిత్రాన్ని ఎప్పుడో డబ్బింగ్ చేసి యూట్యూబ్ లోనూ , లోకల్ ఛానల్స్ లోనూ టెలికాస్ట్ చేశారు. అక్కడి జనాలు ఆ సినిమాని ఎగబడి చూడటం కూడా జరిగింది.

కాబట్టి..  హిందీ బయ్యర్స్ ‘ఛత్రపతి’ థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని తెలుస్తోంది.దీంతో నిర్మాతలైన ‘పెన్ స్టూడియోస్’ వారే ఓన్ రిలీజ్ చేసుకోబోతున్నారు అని సమాచారం. ఈ సినిమాకి పెన్ స్టూడియోస్ వారు రూ.100 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారట. అయితే అక్కడ డిజిటల్ రైట్స్ కు రూ.20 కోట్లకు మించి పలకడం లేదు అని తెలుస్తుంది. ఇక థియేట్రికల్స్ పరంగా రూ.30 కోట్లు నెట్ కలెక్షన్లు వచ్చినా గ్రేట్ అని తెలుస్తుంది.  తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడి జనాలు ఎలాగూ చూడరు. కాబట్టి బెల్లంకొండ వల్ల ‘పెన్ స్టూడియోస్’ వారికి రూ.100 కోట్లు నష్టపోయారని చెప్పాలి. బెల్లంకొండ వల్ల భవిష్యత్తులో.. హిందీ డబ్బింగ్ వెర్షన్లతో యూట్యూబ్లో వంద మిలియన్ల వ్యూస్ కొట్టిన తెలుగు హీరోలకు హిందీ ఫిలిం మేకర్స్ దూరంగా ఉండే ప్రమాదం కూడా ఉంది.

ఇక హిందీ ఛత్రపతి టీజర్ ఇటీవల రిలీజ్ అయ్యి రూ.10 మిలియన్ వ్యూస్ ను నమోదు చేయడానికి అష్టకష్టాలు పడింది. అది కూడా నిర్మాతలు పెయిడ్ ప్రమోషన్స్ చేయడం వల్ల అని స్పష్టమవుతుంది. టీజర్ అయితే బాగానే ఉంది. కానీ అనుకున్నంత బజ్ అయితే రాలేదు. ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్ డైరెక్ట్ చేశాడు. తెలుగు వెర్షన్ తో పోలిస్తే ఆయన హిందీ వెర్షన్ కు చాలా మార్పులు చేసినట్లు తెలుస్తుంది. నుష్రత్ బరుచా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. తనిష్క్ బాగ్చి సంగీత దర్శకుడు.’రాధే శ్యామ్’ చిత్రంలో ప్రభాస్ కు తల్లిగా నటించిన భాగ్య శ్రీ ఈ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు తల్లి పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు భాగ్య శ్రీ కి నడుమ వచ్చే సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయట. ఒరిజినల్ లో తమ్ముడి పాత్ర డామినేషన్ వల్ల హీరో కొంచెం వెనకడుగు వేయాల్సి వస్తుంది. కానీ హిందీలో ఆ పాత్రకు చాలా మార్పులు చేశాడట దర్శకుడు వినాయక్. కాబట్టి హిందీ వెర్షన్ బాగా వచ్చినట్టు టీం చెబుతుంది. మే 12న ఈ మూవీ విడుదల కాబోతోంది.

Read more : Dasara review : దసరా మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *