rudramkota review

‘రుద్రం కోట’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Reviews News

నటీనటులు : జ‌య‌ల‌లిత‌, అనిల్ ఆర్కా, విభిష జాను,అలేఖ్య గాదంబోయిన, బాచి, ర‌మ్య త‌దితరులు
సినిమాటోగ్రఫీ : ఆదిమ‌ల్ల‌ సంజీవ్‌
సంగీతంః సుభాష్ ఆనంద్‌ నిరంజ‌న్‌
ఎడిట‌ర్ః ఆవుల వెంకటేష్‌
నిర్మాతః అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి
స్టోరి-స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వంః రాము కోన‌

కొంత గ్యాప్ తర్వాత సీనియర్ నటి జయలలిత నటించిన సినిమా ‘రుద్రం కోట’. అనిల్ ఆర్కా, విభిష జాను జంటగా నటించిన ఈ సినిమాలో అలేఖ్య గాదంబోయిన కీలక పాత్ర పోషించింది. టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 22 న అనగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి :

కథ : వివాహేతర సంబంధాలు పెట్టుకున్న భార్యాభర్తలను కఠినంగా శిక్షిస్తూ ఉంటారు రుద్రుడు(అనిల్ ఆర్కా) , కోటమ్మ(జయలలిత). చిన్నప్పుడే తల్లిదండ్రులకి దూరమైన రుద్రుడుకి అన్నీ ఆ ఊరి పెద్ద కోటమ్మే. ఆమె కూడా భర్తని, కొడుకుని దూరం చేసుకుని ఊరే తనకి సర్వస్వం అనుకుంటూ జీవిస్తూ ఉంటుంది.రుద్రుడుకి ఆడవాళ్ళు అంటే అస్సలు నచ్చదు.అస్సలు వాళ్ళ మొహం కూడా చూడడు. అయినప్పటికీ అతన్ని శక్తి(విభీష జాను) ప్రేమిస్తుంది. ఊహించని విధంగా శక్తిని కొంతమంది రేప్ చేసి చంపేస్తారు. వాళ్ళు ఎవరు? రుద్రుడు, కోటమ్మ ల గతం ఏంటి? అనేది తెరపై చూడాల్సిన కథ.

ఎవరెలా చేసారంటే : సీనియర్ నటి జయలలిత .. కోటమ్మ పాత్రలో మెప్పించింది. ఆమె లుక్, హావభావాలు.. ఆమె సీనియారిటీని తెలియజేస్తాయి. రుద్రుడుగా అనిల్ ఆర్కా కూడా జీవించేశాడు అని చెప్పాలి. యాక్షన్ సీన్స్ లో , ఎమోషనల్ సన్నివేశాల్లో అతని నటన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక హీరోయిన్ విభిష శక్తి లుక్స్ ఆకట్టుకున్నాయి.చక్కని నటన కనపరిచింది కూడా..! అలేఖ్య కూడా చాలా చక్కగా నటించింది. ఈమె పాత్ర అందరినీ ఆకర్షిస్తుంది.

సాంకేతిక నిపుణుల పనితీరు: ఆధునిక యుగంలో స్త్రీలు ఎలా ఉండాలి… ఎంత నిగ్రహంగా ఉండాలి అనే విషయాన్ని ఈ సినిమాలో చాలా చక్కగా చెప్పాడు దర్శకుడు రాము కోన. క్లైమాక్స్ అందరినీ మెప్పిస్తుంది. హీరో అనిల్ ఆర్కా నిర్మాతగా కూడా చేసిన సినిమా ఇది. టెక్నికల్ గా కూడా బాగుంది.సుభాష్ ఆనంద్, యువి నిరంజన్.. సంగీతంలో రూపొందిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ కూడా సినిమాకి హైలెట్ గా నిలిచాయి. ప్రొడక్షన్ డిజైన్ కూడా కథకి తగ్గట్టు చక్కగా కుదిరింది.

చివరి మాట : ‘రుద్రం కోట’ ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా బాగా మెప్పిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అందరినీ కట్టిపడేస్తుంది. థియేటర్లలో తప్పకుండా చూడదగ్గ సినిమా ఇది.

రేటింగ్ : 3/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *