చిన్న జీయర్ స్వామీజీ ప్రారంభించిన శంషాబాద్ దగ్గర లోని ఆలయ్ రోలింగ్ మెడోస్ ..

News

ఆలయ్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో శంషాబాద్ లో ప్రపంచ స్థాయి వసతులతో కూడిన రోలింగ్ మెడోస్ ప్రపంచస్థాయి లగ్జరీ విల్లాస్ గ్రేటెడ్ కమ్యూనిటీని ప్రారంభించారు. తుక్కుగుడా, మజీద్ గడ్డ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఈ వెంచర్ను ఏర్పాటు చేశారు. ఇందులో 122 విల్లాలు నిర్మిస్తున్నారు. పచ్చదనంతో ఉన్న 37.6 ఎకరాలలో 5 bhk విల్లాలను 7806 చదరపు అడుగులు మొదలుకొని 10645 చదరపు అడుగులలో నిర్మిస్తున్నారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 సర్వీస్ రోడ్డుకు అనుసంధానంగా వీటిని నిర్మిస్తున్నారు. 14 ఫీట్ల ఫ్లోర్ హైట్స్ మరియు 11 ఫీట్లు మెయిన్ డోర్ ఉండటం వీటి ప్రత్యేకత. ఇటాలియన్ మార్బుల్ తో ఫ్లోరింగ్ మరియు టాయిలెట్లు, నోకెన్ సానిటరీ, ల్యుట్రాన్ ఎలక్ట్రికల్ ఆటోమేషన్, మిస్తిబ్యుషి vrv ac, kone లిఫ్టులు, పలుచని అల్యూమినియం కిటికీలు, సెక్యూరిటీ కోసం బయోమెట్రిక్ విధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. రెండు ఎకరాలలో సెంట్రల్ పార్క్, ఆర్గానిక్ గార్డెన్ 50% ఓపెన్ స్పేస్ తో పాటు ఔట్ డోర్ స్పోర్ట్స్, వాకింగ్ కి మరియు సైక్లింగ్ కు అనుగుణంగా ట్రాక్ ఇదే కాకుండా 40,000 చదరపు అడుగుల క్లబ్ హౌస్ ను బౌలింగ్ ఆలే , స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్, జిమ్, మల్టిపర్పస్ హల్, కాఫెటేరియా రానున్నాయి.

ఆలయ్ ఇన్ఫ్రా మేనేజింగ్ పార్ట్నర్ నిరూప రెడ్డి ఆధ్వర్యంలో ఈ విలాసవంతమైన ప్రాజెక్ట్ తీర్చిదిద్దన్నారు. ఈ ప్రాజెక్టును ప్రముఖ గురువులు హెచ్ హెచ్ చిన్న జీయర్ స్వామీజీ చేతుల మీదుగా ప్రారంభించారు.

 

కలలు, ఆకాంక్షలు మరియు అంచనాలు వంటి అస్పష్టమైన వాటిని ప్రత్యక్షమైన సృష్టిగా మార్చడం మరియు అతని దృష్టి.. అవే నిరూప్ రెడ్డి తన ఆర్కిటెక్చరల్ డిజైన్ సంస్థ, NA ఆర్కిటెక్ట్స్‌ను 2003లో హైదరాబాద్‌లో నెలకొల్పడానికి పురికొల్పింది. అతని వైవిద్యమైన ఆలోచనలు, డిజైన్లు అతనికి కొద్ది కాలంలోనే ఎంతో పేరు, నమ్మకం తీసుకొచ్చెలా చేసింది. ఈ కారణంగానే అతనికి నిర్మాణ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకునేలా చేసింది.

భారతదేశపు టాప్ 30 ఆర్కిటెక్ట్‌ల ఫోర్బ్స్ ఇండియా “ది బోల్డ్ క్లబ్”లో నిరూప్ రెడ్డికి స్థానం లభించింది, ఈ గుర్తింపు ఒక ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్‌గా తనపై ఉన్నతమైన బాధ్యతను కలిగిస్తుందని భావిస్తున్నారు. ఫోర్బ్స్ ఇండియా ‘ది బోల్డ్ క్లబ్: ఇండియాస్ టాప్ 30 ఆర్కిటెక్ట్స్’లో ప్రముఖ మరియు ప్రభావవంతమైన ఆర్కిటెక్ట్‌ల కథనాలు ఉన్నాయి, వీరు తమదైన ప్రత్యేక పద్ధతిలో భారతదేశం మరియు విదేశాలలో గణనీయమైన ప్రభావాన్ని చూపారు.

Read more :  ABCPL (TV9) తన అనుబంధ సంస్ధల విలీన వివరణ ప్రకటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *