ABCPL (TV9) తన అనుబంధ సంస్ధల విలీన వివరణ ప్రకటన

News

గత కొన్నేళ్లుగా టెలివిజన్ రంగంలో అగ్రగామిగా దూసుకెళ్తున్న తెలుగు మీడియా సంస్థల్లో టివి9 అగ్రభాగాన నిలుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. అయితే విషయం ఏమిటంటే, ఇటీవల ABCPL (TV9) తన అనుబంధ సంస్ధల విలీనానికి సంబందించి తమ అనుమతి కోసం ఏర్పాటు చేసిన (EGM) కు సంబంధించిన నోటీసులు ఫిబ్రవరి 6 తేదీన వాటాదారులకు పంపారు. కాగా ఈ సమావేశం మార్చి 2న జరగనుంది.

అయితే ABCPL మూలధనంలో అలందా మీడియా 97 శాతం అత్యధిక వాటా కలిగి ఉంది. ఒకప్పుడు టివి9 లో సీఈఓ గా వర్క్ చేసిన వి. రవిప్రకాష్‌ ప్రస్తుతం ABCPL లో చిన్న వాటాదారుల్లో ఒకరు. రవిప్రకాష్‌కు వాటాదారునిగా విలీనానికి సంబంధించిన పత్రాలను పరిశీలించడానికి మాత్రమే అనుమతి ఇచ్చాం. EGM అనేది ABCPL అకౌంట్స్‌ పరిశీలన కోసం కాదు. కాబట్టి, ఇక్కడ ఎలాంటి అకౌంట్ల తనిఖీ చేయడానికి అవకాశం లేదు. కావున దీనికి సంబంధించి సోషల్‌ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకే చేస్తున్న ప్రకటన ఇది.

Read more : భగవద్గీతలో ఒక భాగమే మహాభారతం అంటున్న తెప్ప సముద్రం..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *