‘ఏందిరా ఈ పంచాయితీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Reviews News

నటీ నటులు : భరత్, విషికా లక్ష్మణ్‌, రవి వర్మ, ప్రేమ్ సాగర్,కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

బ్యానర్ : ప్రభాత్ క్రియేషన్స్
నిర్మాత : ప్రదీప్ కుమార్. ఎం
దర్శకత్వం  : గంగాధర. టి
సినిమాటోగ్రఫీ  : సతీష్‌ మాసం
సంగీతం : పీఆర్ (పెద్దపల్లి రోహిత్)

ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో టీజర్, ట్రైలర్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న సినిమాగా ‘ఏందిరా ఈ పంచాయితీ’ మూవీ నిలిచింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం :

కథ : రామాపురం అనే ఓ గ్రామంలో ఊహించని విధంగా వరుస దొంగతనాలు జరుగుతాయి. దీంతో ఆ ఉరి ప్రజల్లో అలజడి మొదలవుతుంది. ఈ క్రమంలో ఆ ఊరి పెద్దలు అయిన పెద్దారెడ్డి (తోటపల్లి మధు) సుధాకర్ రెడ్డి (రవి వర్మ ) రామచంద్రా రావు( కాశీ విశ్వనాధ్)లు ఓ పంచాయితీ పెడతారు. ఈ ఊరిలో జరిగే దొంగతనాలు ఎవరు చేస్తున్నారు? వారిని అరికట్టేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే విషయం పై చర్చలు జరుపుతారు. ఆ తర్వాత పోలీసులు ఏం చేశారు? హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ఎలా కుదిరింది. చివరికి ఆ ఊర్లో జరిగిన దొంగతనాలకు వీళ్ళ ప్రేమకి లింక్ ఏంటి? వంటి వ్యవహారాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీ నటుల పనితీరు : ప్రధాన పాత్రదారి అభి(భరత్ )తన హావ భావాలతో పాటు, డైలాగ్ మాడ్యులేషన్ తో ఆకట్టుకున్నాడు. అలాగే డాన్స్, ఫైట్స్ కూడా బాగా చేశాడు. ఏమోషనల్ సన్నివేశాల్లో కూడా తన టాలెంట్ చూపించాడు. ఎక్కడా కూడా అతనికి ఇది మొదటి సినిమా అనే ఫీలింగ్ ప్రేక్షకులకి కలుగదు.యమున పాత్రలో హీరోయిన్ విషికా లక్ష్మణ్‌ బాగా చేసింది.యూత్ కి ఆమె లుక్స్ బాగా నచ్చుతాయి. హీరో ఫ్రెండ్స్ గా నటించిన సత్తి (తేజ ), శ్రీను పాత్రలో దర్శకుడు గంగాదర్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌తో కామెడీ ట్రాక్‌తో మెప్పించారనే చెప్పాలి.ఊరి జనాలకు ఏ కష్టం వచ్చినా ముందుండే ఉరి పెద్దకులుగా పెద్దారెడ్డి (తోటపల్లి మధు), సుధాకర్ రెడ్డి(రవి వర్మ ), రామచంద్ర ( కాశీ విశ్వనాధ్ ) చాలా చక్కగా నటించాడు.పోలీస్ ఇన్వెస్టిగేషన్ పాత్రలో నటించిన యస్. ఐ.ప్రదీప్ (విజయ్ ) నటన న్యాచురల్ గా ఉంది. అభికి తండ్రి గా ప్రేమ్ సాగర్, బ్యాంక్ మేనేజర్ గా సమీర్ లు, యమున ఫ్రెండ్ గా స్వాతి (లత ) చక్కటి పెర్ఫార్మన్స్ చేశాడు.ఇంకా ఇందులో నటించిన వారంతా తమ పరిదిమేరకు నటించి ప్రేక్షకులను మెప్పించారని చెప్పవచ్చు.

టెక్నికల్ టీం ఎలా చేసారంటే : డైరెక్టర్ గంగాధర్ కిది మొదటి సినిమా అయినప్పటికీ
సిటీలో ఉండే పబ్ కల్చర్, పల్లెటూర్లో ఉండే స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందనేది బాగా చూపించాడు. ఎమోషనల్‌ సీన్స్, సస్పెన్స్ , లవ్ ట్రాక్ ఇలా అన్నిటిని సమర్థవంతంగా మేనేజ్ చేశాడు.ఈ సినిమాలో ఎటువంటి డబుల్ మీనింగ్ జోకులు గాని లేకుండా సహజంగా ఆకట్టుకునే సన్నివేశాలతో నీట్ అండ్ క్లీన్ సినిమాని తెలుగు ప్రేక్షకులు అందించడంలో దర్శకుడు గంగాదర్ సక్సెస్ అయ్యాడని అనుకోవచ్చు.పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. జేపీ ఎడిటింగ్ కూడా బాగా కుదిరింది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరి మాట : ఓవరాల్ గా ‘ఏందిరా ఈ పంచాయితీ’ సినిమా వీకెండ్ కి ఫ్యామిలీతో థియేటర్ కి వెళ్లి చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా.

రేటింగ్ : 3/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *