brahmastra review

Brahmastra Movie Telugu Review: ‘బ్రహ్మాస్త్రం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

News Reviews

ఈ ఏడాది బాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలు ఏవీ సత్తా చాటలేకపోయాయి. ఎన్నో ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ఆమిర్ ఖాన్ కూడా ‘లాల్ సింగ్ చడ్డా’ తో బోల్తా కొట్టాడు.మినిమం గ్యారెంటీ అనుకున్న అక్షయ్ కుమార్ సినిమాలు కూడా వీకెండ్ కే దుకాణం సర్దేసే పరిస్థితి ఏర్పడింది. గత 4,5 నెలల నుండి అయితే పరిస్థితి మరీ దారుణం. హిట్టు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ‘బ్రహ్మాస్త్ర’ అనే చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ తో వారికి కొంచెం ఊరటనిచ్చింది. తెలుగులో కూడా ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. నాగార్జున ఈ చిత్రంలో భాగం కావడం, రాజమౌళి సమర్పకులుగా వ్యవహరిస్తుండడం, మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ సినిమాపై హైప్ ఏర్పడింది. మరి ఆ రేంజ్ లో సినిమా ఉందొ లేదో చూద్దాం :

కథ : ఈ భూమి పై ఎన్నో అస్త్రాలు ఉంటాయి. వాటికి దేవతగా ‘బ్రహ్మాస్త్ర’ ఉంటుంది. కొంతమంది వ్యక్తుల బృందం బ్రహ్మాస్త్ర ని కాపాడుతూ ఉంటుంది. దేవ్ అనే వ్యక్తి అత్యాశ వల్ల… బ్రహ్మాస్త్ర మూడు ముక్కలు అవుతుంది. అందులో ఒకటి సైంటిస్ట్ మోహన్ భార్గవ్ (షారూఖ్ ఖాన్) వద్ద, మరొకటి ఆర్టిస్ట్ అనీష్ శెట్టి (అక్కినేని నాగార్జున) వద్ద ఉంటుంది. మూడోది ఎక్కడ ఉందో తెలీదు. ఈ ‘బ్రహ్మాస్త్ర’ను వశం చేసుకోవాలని దేవ్‌కు చెందిన మనుషులు (మౌనీ రాయ్‌తో పాటు మరో ఇద్దరు) చేయకూడని తప్పులు అన్నీ చేస్తుంటారు. షారుఖ్ ఖాన్ పాత్రని, నాగార్జున పాత్రని చంపుతాయి.బ్రహ్మాస్త్ర కనుక శత్రువుల చేతిలోకి వెళ్లి ఒక్కటైతే ఈ సృష్టి నాశనమైపోతుంది. ఊహించని విధంగా డీజే శివ (ర‌ణ్‌బీర్‌ కపూర్) కు ఈ బ్రహ్మాస్త్రం గురించి దీని వెనుక జరుగుతున్న కుట్ర గురించి తెలుస్తుంటుంది? అతనికి ఎలా తెలుస్తుంటుంది? అసలు శివ ఎవరు? బ్రహ్మాస్త్ర ని దేవ్ మనుషుల పాలవ్వకుండా అతను అడ్డుకున్నాడా? లేదా? అన్నది మిగిలిన కథ

నటీనటుల పనితీరు : రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్, మౌనీ రాయ్, షారుఖ్ ఖాన్, నాగార్జున.. ఇలా నటీనటులంతా మంచి నటన కనబరిచారు. వారి పాత్రలకు న్యాయం చేశారు. నాగార్జునని పక్కన పెడితే.. ఈ హిందీ బ్యాచ్ కు తెలుగు డబ్బింగ్ యాప్ట్ అవ్వలేదు. వీళ్ళ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు వాయిస్ లు ఉండవు. థియేటర్లో తెలుగు ప్రేక్షకులు నవ్వుకుంటున్నారు అంటే ఇదే కారణం. మనకు డబ్బింగ్ సినిమాలు కొత్త కాదు. కానీ హిందీ డబ్బింగ్ సినిమాలను థియేటర్లలో చూడటం చాలా మంది ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి మేకర్స్ ఈ డబ్బింగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి.

టెక్నికల్ టీం పనితీరు : డైరెక్టర్ అయాన్ ముఖర్జీ మంచి కాన్సెప్ట్ ను డిజైన్ చేసుకున్నాడు. ఇలాంటి పెద్ద ప్రాజెక్టుని హ్యాండిల్ చేయడం అంటే మాటలు కాదు. కాకపోతే టేకింగ్ తో అతను ఆకట్టుకోలేకపోయాడు. వి.ఎఫ్.ఎక్స్ విషయంలో చాలా మైనస్ లు ఉన్నాయి. కొన్ని సీన్లు చూస్తుంటే ‘అవెంజర్స్’ కు స్పూఫ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. కుంకుమల సాంగ్ తప్ప మిగిలిన అన్ని సాంగ్స్ జనాలకు బోర్ కొట్టిస్తాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఈజీగా ఓ అరగంట ట్రిమ్ చేసేయొచ్చు.

చివరి మాట : కాన్సెప్ట్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో నాగార్జున ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ ముగిసేవరకు సినిమా ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ బాగుంటుందేమో అనే ఆశలు రేపుతుంది. కానీ సెకండ్ హాఫ్ ఏమాత్రం ఆకట్టుకోదు. ఎమోషనల్ కనెక్టివిటీ చాలా మిస్ అయ్యింది. ఓపిక ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ ఏదో ఊహించుకుని వెళ్తే మాత్రం కష్టమే..!

రేటింగ్ : 2.5/5

Read more: Ranga Ranga Vaibhavanga Review : ‘రంగ రంగ వైభవంగా’ సినిమా రివ్యూ & రేటింగ్! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *