హీరో శ్రీకాంత్ లాంచ్ చేసిన ‘ఫోకస్’ మూవీ ట్రైలర్

News

విజ‌య్ శంక‌ర్, `బిగ్‌బాస్` బ్యూటీ అషూరెడ్డి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం `ఫోక‌స్`. సుహాసిని మ‌ణిర‌త్నం, భానుచంద‌ర్ కీల‌క వంటి అగ్ర నటీనటులు కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.స్కైరా క్రియేషన్స్‌ సమర్పణలో రిలాక్స్‌ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జి. సూర్య‌తేజ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి వీర‌భ‌ద్ర‌రావు ప‌రిస‌ నిర్మాత‌. ఓ మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం రూపొందింది. ప్రచార చిత్రాలకు, టీజ‌ర్ కు సూపర్ రెస్పాన్స్ లభించిన సంగతి తెలిసిందే. అషురెడ్డి ఈ చిత్రంలో మొద‌టిసారిగా పోలీస్ ఆఫీస‌ర్‌ పాత్రలో కనిపించనుంది. అక్టోబ‌రు 28న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేట‌ర్స్‌లో కానుంది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ ‘ఫోకస్’ ట్రైలర్ ను హీరో శ్రీకాంత్ లాంచ్ చేశారు.

అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ …   “ఫోకస్ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. అలాగే ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. డైరెక్టర్  సూర్య‌తేజ మంచి సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది. హీరో విజ‌య్ శంక‌ర్ నటన కూడా ఆకట్టుకుంటుందనిపిస్తుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఎక్కువగానే ఉన్నట్లు అనిపిస్తుంది. అక్టోబర్ 28న ఈ మూవీ థియేట‌ర్లో విడుద‌ల‌వుతుంది. మంచి సక్సెస్  అందుకోవాలని కోరుకుంటూ… నిర్మాతగా ప‌రిచ‌య‌మ‌వుతున్న‌ వీరభ‌ద్ర‌రావు గారికి, మిగతా టీమ్ కు ఆల్ ది బెస్ట్“ అంటూ చెప్పుకొచ్చాడు.

హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ …  “ ‘ఫోకస్’ నా కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ. శ్రీకాంత్ అనా..  ‘ట్రైలర్ లాంచ్ చేసినందుకు చాలా థాంక్స్’. ఈ సినిమా కంప్లీట్ క్రైమ్ థ్రిల్ల‌ర్. ఇలాంటి జోనర్ సినిమాలను ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్‌లా అనిపిస్తుంది. దర్శకులు సూర్య‌తేజ‌గారు అంత చక్కగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అక్టోబ‌రు 28న విడుదలవుతున్న మా ‘ఫోకస్’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.” అంటూ చెప్పుకొచ్చాడు.

నిర్మాత వీర‌భ‌ద్ర‌రావు ప‌రిస‌ మాట్లాడుతూ …  “ ‘ఫోక‌స్’ మూవీ ట్రైల‌ర్ ను శ్రీ‌కాంత్ గారు లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అక్టోబర్ 28న సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ చూసి మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించాలాని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

ద‌ర్శ‌కుడు జి. సూర్య‌తేజ మాట్లాడుతూ – “’ఫోక‌స్’ అనేది ఓ న్యూ ఏజ్ క్రైమ్ థిల్ల‌ర్. ఆడియ‌న్స్ ఈ జోన‌ర్‌ను ఎక్కువ‌గా ఇష్టపడతారు, ఎంక‌రేజ్ చేస్తారు అనేది నా ఫీలింగ్.  సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో క‌థ‌,క‌థ‌నాలు ఉంటాయి. అక్టోబర్ 28న విడుదలవుతున్న మా ‘ఫోకస్’ ను మీరు చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను“ అంటూ చెప్పుకొచ్చాడు.

 

Read more :Focus movie : యంగ్ టీమ్‌ చేసిన `ఫోక‌స్` మూవీ టీజ‌ర్ చాలా బాగుంది : శేఖ‌ర్ క‌మ్ముల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *