andharu bagundali andhulo nenundali review : ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Reviews

టాలీవుడ్ స్టార్ కమెడియన్, నటుడు అయిన అలీ నిర్మాతగా తన అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మలయాళంలో ఇండస్ట్రీ హిట్ అయిన ‘వికృతి’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించాడు.అలీ ఇందులో హీరోగా నటించగా నరేష్, పవిత్రా కీలక పాత్రలు పోషించారు.మౌర్యాని ఈ చిత్రంలో హీరోయిన్. కాగా ఈ చిత్రం నేడు ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అయింది. మరి ఈ మూవీ ఎంత వరకు ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి :

కథ :శ్రీనివాసరావు(నరేష్) – సునీత(పవిత్ర లోకేష్) దంపతులది చాలా సింపుల్ ఫ్యామిలీ. ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ కొడుకు, కూతురితో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో .. మహమ్మద్ సమీర్(అలీ) తీసిన ఓ ఫోటో కారణంగా వీళ్ళకి సమస్యలు వచ్చి పడతాయి. దుబాయ్ నుండి ఇండియాకు వచ్చిన మహమ్మద్ సమీర్ కి సెల్ఫీల పిచ్చి. ఆ పిచ్చి కారణంగా ఓ పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ సమస్య ఏంటి?, దిల్ రుబాతో (హీరోయిన్ మౌర్యాని) కి దీంతో సంబంధం ఏంటి ? వీళ్ల మధ్య ప్రేమ ఎలా చిగురించింది? వీళ్ళు పెళ్లి చేసుకుంటారా? చివరకు శ్రీనివాసరావు – సునీత జీవితాలు చక్కబడ్డాయా? లేదా? అన్నది మీరు ఆహా లో చూసి తెలుసుకోవాల్సిన కథ.

నటీనటుల పనితీరు : అలీ టాలెంట్ గురించి, కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే. హీరోగా కూడా ఆయన గతంలో అలరించి హిట్లు అందుకున్నాడు.ఇందులో కూడా అలీ హీరో మెప్పించాడు. ఈ పాత్రకు అతను జీవం పోసాడు అనే చెప్పాలి. ఫ్రెండ్ పాత్రలో సింగర్ మను ఆకట్టుకున్నాడు. లాస్య కూడా ఈ చిత్రంలో ఓ ప్రాముఖ్యమైన పాత్రని పోషించింది. అది చెబితే స్పాయిలర్ అవుతుంది. నరేష్ – పవిత్రా లోకేష్ కెమిస్ట్రీ మరోసారి సక్సెస్ అయ్యింది.సినిమా చూస్తున్నంత సేపు ద్యాస అంతా నరేష్- పవిత్రల కెమిస్ట్రీ పైనే ఉంటుంది అనడంలో సందేహమే లేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

టెక్నికల్ టీం పనితీరు : ఒరిజినల్ చూసిన వారికి కూడా ఈ మూవీ బాగా నచ్చుతుంది అనడంలో సందేహం లేదు. దర్శకుడు శ్రీపురం కిరణ్ అంత చక్కగా హ్యాండిల్ చేశాడు. ఈ చిత్రంలోని సన్నివేశాలు కానీ పాత్రలు కానీ చాలా సహజంగా ఉంటాయి. ఎక్కడా కూడా బోర్ అనిపించవు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్, కామెడీ సీన్స్ బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. ట్విస్ట్ లు కూడా చక్కగా ఇమిడాయి అని చెప్పొచ్చు. రాకేశ్‌ పళిడమ్‌ నేపధ్య సంగీతం బాగుంది. అలాగే ఎస్‌. మురళి మోహన్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి. కొనతాల మోహన్‌ ఖర్చుకి ఏమాత్రం రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సాంకేతిక నిపుణులు అందరూ ఈ సినిమాకి చాలా శ్రద్ధతో పనిచేసినట్టు స్పష్టమవుతుంది.

విశ్లేషణ : ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ .. హ్యాపీగా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా.

రేటింగ్ : 3/5

Read more : God Father : ‘గాడ్ ఫాదర్’ ఆడకపోవడానికి కారణాలు ఏంటి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *