kushi review : ‘ఖుషి’ మూవీ రివ్యూ .. సాగధీత తట్టుకుంటే ఓకే

Reviews News

విడుదల తేదీ : సెప్టెంబర్ 2 2023
తారాగణం : విజయ్ దేవరకొండ, సమంత, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, వెన్నెల కిషోర్, జయరాం, రోహిణి, రాహుల్ రామకృష్ణ తదితరులు
దర్శకత్వం : శివ నిర్వాణ
సంగీతం : హేషమ్ అబ్దుల్ వాహాబ్
సినిమాటోగ్రఫీ : మురళి జి
నిర్మాత : నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్
నిర్మాణ సంస్థ : ‘మైత్రి మూవీ మేకర్స్’

2018 లో వచ్చిన ‘టాక్సీ వాలా’ తర్వాత విజయ్ దేవరకొండ వరుసగా ప్లాపులు ఫేస్ చేస్తూ వచ్చాడు. గతేడాది వచ్చిన ‘లైగర్’ అయితే తీవ్రంగా నిరాశపరిచింది. కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన టైంలో ‘ఖుషి’ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లేట్ చేయకుండా ‘ఖుషి’ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

కథ : విప్లవ్ దేవరకొండ(విజయ్ దేవరకొండ) జాతకాలు, ముహుర్తాలు, మూఢనమ్మకాలను నమ్మని నాస్తికుడు లెనిన్ సత్యం(సచిన్ ఖేడేకర్) కొడుకు. ఇతను కూడా నాస్తికుడే. అయితే గవర్నమెంట్ జాబ్ రీత్యా కశ్మీర్ వెళ్లిన అతనికి ఆరాధ్య(సమంత) తో పరిచయం ఏర్పడుతుంది. మొదట ఆమె ముస్లిం అనుకుని వెంటపడిన విప్లవ్ కి ఆమె బ్రాహ్మణ యువతి అని తెలుస్తుంది. మరోపక్క ఆమె తండ్రి చదరంగం శ్రీనివాసరావు(మురళీ శర్మ) గొప్ప ప్రవచనకర్త.అంతేకాదు జాతకాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటాడు. అంతేకాదు లెనిన్ సత్యంకి చదరంగం శ్రీనివాసరావుకి అస్సలు పడదు. ఇలాంటి టైంలో వీరి పిల్లలు అయిన విప్లవ్, ఆరాధ్య పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఏమైంది అనేది మిగిలిన కథ.

నటీనటులు ఎలా చేసారంటే : విజయ్ దేవరకొండ నటన బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. అలాగే ఈ సినిమాలో అతను చాలా అందంగా కనిపించాడు. అయితే హీరోయిన్ సమంత లుక్స్ మాత్రం అస్సలు బాలేదు. విజయ్ దేవరకొండ కంటే ఆమె ఎక్కువ వయసు కలిగిన అమ్మాయి అని ఇట్టే అర్ధమైపోతుది. వీళ్ళ కెమిస్ట్రీ కూడా అంతగా ఇంప్రెస్ చేయదు. ఆరాధ్య అనే పాటలో లిప్ లాక్ విజువల్స్ ఓ వర్గం ప్రేక్షకుల్ని అలరించొచ్చు. వెన్నెల కిషోర్ ఫస్ట్ హాఫ్ లో బాగానే నవ్వించి మాయమైపోయాడు. మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్ , రాహుల్ రామకృష్ణ, శరణ్య , లక్ష్మీ , శ్రీకాంత్ అయ్యంగర్ వంటి వారి నటన గురించి కొత్తగా చెప్పుకునేది ఏముంది. అందరూ బాగా చేశారు.

టెక్నికల్ టీం పనితనం : ‘టక్ జగదీష్’ తో మాస్ బాటలో అడుగేసి బోల్తా పడ్డ శివ నిర్వాణ.. ఈసారి తనకి అలవాటైన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను నమ్ముకుని ‘ఖుషి’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫస్ట్ హాఫ్ బాగానే సాగింది. టెర్రరిస్ట్ లతో ఫైట్ సీక్వెన్స్ అనవసరమైనప్పటికీ.. ఫస్ట్ హాఫ్ పరంగా ఓకే. అసలు కథంతా అతను సెకండాఫ్ కోసం దాచుకున్నాడు. కథ పరంగా సెకండ్ హాఫ్ లో విషయం ఉంది అనేది నిజం. కానీ నెరేషన్ చాలా స్లోగా ఉంది. విజయ్ దేవరకొండ వీర్యం టెస్ట్ చేయించుకోవడానికి వెళ్లే సన్నివేశం అనవసరం. ఫ్యామిలీ సినిమా అన్నప్పుడు అలాంటి సన్నివేశాలు ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇబ్బందిగా ఫీలవుతారు. ఇలాంటి అనవసరమైన సన్నివేశాలు సెకండ్ హాఫ్ లో చాలానే ఉన్నాయి. అయితే క్లైమాక్స్ పోర్షన్ కన్వెన్సింగ్ గా అనిపిస్తుంది. అక్కడ హీరో, హీరోయిన్ల కంటే కూడా సచిన్ ఖేడేకర్ , మురళీ శర్మ…లు ఎక్కువ మార్కులు కొట్టేశారు. సరే సినిమా అయిపోయింది అని అందరూ సీట్లలో నుండి వెళ్లిపోవడానికి రెడీ అయితే బ్రహ్మానందం సీన్ పెట్టి ఇరిటేట్ చేశాడు దర్శకుడు. అది సాగదీసినట్టు ఉంది కానీ అతికినట్టు లేదు.

చివరి మాట : మొత్తంగా ‘ఖుషి’ ఫస్ట్ హాఫ్ పరంగా ఓకే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఓపికతో చూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్ కి పర్వాలేదు అనిపించినా యూత్ కి మాత్రం సెకండ్ హాఫ్ బోర్ అనిపించే అవకాశాలు ఉన్నాయి.

రేటింగ్ : 2.5/5

 

Read more : Chenna keshava reddy : ఆ కారణాల వల్లే చెన్నకేశవ రెడ్డి సరిగ్గా ఆడలేదు : వినాయక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *