manishankar

Manishankar : ‘మ‌ణిశంక‌ర్’ టీజ‌ర్‌ ను విడుదల చేసిన ‘బంగార్రాజు’ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ

News

శివ కంఠమనేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దే, చాణ‌క్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతున్న చిత్రం “మణిశంకర్”. డ‌బ్బు నేపథ్యంలో జరిగే ఆస‌క్తిక‌ర‌మైన కథాంశంతో ఈ చిత్రం యాక్ష‌న్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెర‌కెక్కింది. జి.వి.కె(జి. వెంక‌ట్‌కృష్ట‌ణ్‌) ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ భాద్య‌త‌ల్ని నిర్వహిస్తున్నారు. ‘లైట్ హౌస్ సినీ క్రియేషన్స్’ బ్యానర్ పై  కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీ‌నివాస‌రావు, ఎం. ఫణిభూషణ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌మోష‌న్లలో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ వంటి వాటికి మంచి స్పంద‌న ల‌భించింది. తాజాగా టీజ‌ర్‌ను ‘బంగార్రాజు’ ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ విడుదల చేశారు.

అనంతరం కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ…  “మ‌ణిశంక‌ర్ పోస్ట‌ర్స్‌, టీజ‌ర్ చూశాను. ఇంప్రెసివ్‌గా అనిపించాయి. ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల‌ను ఆధారం చేసుకుని డైరెక్టర్ జీవీకే ఈ స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. రియ‌లెస్టిక్‌గా ఉంది. శివ కంఠ‌మ‌నేని గారి పెర్‌ఫామెన్స్ కట్టిపడేస్తుంది అనిపిస్తుంది. ఈ మూవీ మంచి స‌క్సెస్ సాధించాలని జీవీకే, శివ గారి కెరీర్‌కు బాగా హెల్ప్ అవ్వాల‌ని కోరుకుంటూ మ‌ణిశంక‌ర్ టీమ్ కు ఆల్ ది బెస్ట్“ చెప్పారు.

చిత్ర ద‌ర్శ‌కుడు జీవీకే మాట్లాడుతూ – “క‌ళ్యాణ్ కృష్ణ‌గారు మంచి పాజిటీవ్ యాటిట్యూట్ ఉన్న దర్శకుడు. అంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని కోరుకునే మంచి మ‌న‌సున్న వ్యక్తి. మా మ‌ణిశంక‌ర్ మూవీ  టీజ‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ‌గారి చేతుల‌మీదుగా రిలీజ‌వ‌డం చాలా సంతోషంగా ఉంది. మ‌ణిశంక‌ర్ అనేది ఓ యాక్షన్ థ్రిల్ల‌ర్‌. మంచి కంటెంట్‌ని యాక్ష‌న్ మోడ్‌, స‌స్పెన్స్ వేలో చెప్పాము. మంచి టీమ్ తో క‌లిసి ప‌నిచేశాం కాబ‌ట్టి మంచి అవుట్పుట్ వ‌చ్చింది“ అంటూ ఆశాభావం వ్యక్తం చేసారు.

హీరో శివ కంఠ‌మ‌నేని మాట్లాడుతూ – “టీజ‌ర్ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను.ఇది అందరినీ ఎంటర్టైన్ చేసే  మంచి స‌బ్జెక్ట్‌. మ‌ణిశంక‌ర్ అనే ఓ పెద్ద గ్యాంగ్‌స్ట‌ర్ చేసే డీలింగ్స్‌కి సంబంధించిన క‌థ‌. సంజ‌న‌, చాణుక్య‌, ప్రియా హెగ్డే ఈ నాలుగు పాత్ర‌ల చుట్టూ క‌థ‌ తిరుగుతుంటుంది. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు యాక్ష‌న్‌ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్  ఉంటాయి. త‌ప్ప‌కుండా అందరూ చూసి ఎంజాయ్ చేయదగ్గ మూవీ“అన్నారు.

తారాగ‌ణం: శివ కంఠ‌మ‌నేని, సంజ‌న గ‌ల్రాని, అరోహి నాయుడు, నెల్లూరు సుబ్బు,ప్రియా హెగ్దే, చాణిక్య‌, మాణిక్య రెడ్డి, సుబ్బ‌రాజ్ శ‌ర్మ‌.

టెక్నీకల్ టీం:
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: జి. వెంక‌ట్ కృష్ణ‌న్ (జీవికే)
నిర్మాత‌లు: కె.ఎస్.శంకర్ రావు, ఆచార్య శ్రీ‌నివాస‌రావు, ఎం. ఫణి భూషణ్
బ్యాన‌ర్‌: లైట్ హౌస్ సినీ క్రియేషన్స్
సినిమాటోగ్ర‌ఫి: జె. ప్ర‌భాక‌ర్ రెడ్డి
సంగీతం: ఎం.ఎల్.రాజా
ఎడిట‌ర్‌: స‌త్య గిదుటూరి
ఆర్ట్‌: షేరా
ఫైట్స్‌: వింగ్‌చున్ అంజీ
లిరిక్స్‌: పేదాడ మూర్తి
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్: ఎం.కె బాబు

 

 

Read more : Focus movie : యంగ్ టీమ్‌ చేసిన `ఫోక‌స్` మూవీ టీజ‌ర్ చాలా బాగుంది : శేఖ‌ర్ క‌మ్ముల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *