allari naresh : అల్లరోడికి సైడ్ క్యారెక్టర్లే బెటరా?

News

అల్లరి  నరేష్ హీరోగా రూపొందిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే సినిమా ఈరోజు అనగా మే 3 న రిలీజ్ అయ్యింది. మల్లి అంకం డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘చిలక ప్రొడక్షన్స్’ బ్యానర్ పై రాజీవ్ చిలక నిర్మించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది.

‘సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసే ఓ కుర్రాడు పెళ్లి అవ్వకపోవడంతో ఇబ్బందులు పడతాడు. చుట్టుపక్కనున్న వాళ్ళు అతన్ని హేళన చేయడం, తర్వాత అతను పెళ్లిళ్ల వెబ్ సైట్స్ లో రిజిస్టర్ అయితే అక్కడ మోసపోవడం.. చివరికి అతనికి హీరోయిన్ తో ఎలా పెళ్లయింది’ అనేది కథ. కాన్సెప్ట్ బాగుంది. కానీ టేకింగ్ అస్సలు బాలేదు. కంప్లీట్ గా డైరెక్షన్ లోపమే అని ప్రేక్షకులు చెబుతున్నారు. నిర్మాత తప్పు లేదు. కథని నమ్మి అతను చేయాల్సింది చేశాడు.

ఇక అల్లరి నరేష్ తన మార్క్ కామెడీతో కూడా ఈ సినిమాని గట్టెక్కించలేకపోయాడు. అసలు అతని యాక్టింగ్ లో ఎనర్జీ లెవెల్స్ లేవు. అందుకే సోషల్ మీడియాలో కొంతమంది నెటిజెన్లు.. కొన్నాళ్ల పాటు అతను ‘మహర్షి’ ‘నా సామి రంగ’ సినిమాల్లో చేసినట్టు సపోర్టింగ్ రోల్స్ చేసుకోవడం బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. ‘నాంది’ హిట్ అవ్వడంతో అల్లరి నరేష్ లో ఓ కన్ఫ్యూజన్ ఏర్పడింది. ప్రతి సినిమాలోనూ అతను మెసేజ్ ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు. అదే అతనికి మైనస్ అవుతుంది అని కూడా కొంతమంది అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *