స్కంద మూవీ రివ్యూ : బోయపాటి మార్క్ టార్చర్

Reviews News

రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఊర మాస్ మూవీ ‘స్కంద‘. అక్టోబర్ 20 నుండి సెప్టెంబర్ 15 కి ప్రీపోన్ అయిన ఈ సినిమా సెప్టెంబర్ 28 కి ఊహించని విధంగా మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యింది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్ పై ఓ రేంజ్లో ట్రోలింగ్ జరిగింది.పెద్దగా బజ్ అయితే ఏర్పడలేదు. మరి సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

కథ : ఆంధ్రప్రదేశ్ కి చెందిన సీఎం కూతురిని తెలంగాణ సీఎం కొడుకు లేపుకుపోతాడు. దీంతో ఈ ఇద్దరి సీఎంల మధ్య గొడవ చోటు చేసుకుంటుంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కొడుకుని చంపి మరీ తన కూతుర్ని తెచ్చుకోవాలి అనుకుంటాడు ఆంధ్ర సీఎం రాయుడు(అజయ్ పుర్కార్). ఈ క్రమంలో రుద్రకంటి భాస్కర్(రామ్) ని రంగంలోకి దింపుతాడు. కానీ ఇంటర్వెల్ లో అతను తెలంగాణ సీఎం రంజిత్ రెడ్డి (శరత్ లోహితస్వ) కూతురు అయిన శ్రీలీల రెడ్డిని కూడా లేపుకుపోతాడు. దీనికి గల కారణం ఏంటి? ఆంధ్ర, తెలంగాణ సీఎంలతో రుద్రకంటి భాస్కర్ కి సంబంధం ఏంటి అనేది మిగిలిన కథ?

ఎవరెలా చేశారు అంటే : రామ్ ఈ చిత్రంలో దాదాపు 45 నిమిషాల పాటు కనిపించడు. అయినప్పటికీ అతను యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేసాడు. అతని పెర్ఫార్మన్స్ సూపర్. దానికి పేరు పెట్టాల్సిన పనిలేదు. శ్రీలీల రెండు పాటల్లో డాన్స్ బాగా చేసింది. అంతకు మించి ఆమె పెద్దగా చేసింది ఏమీ లేదు. శ్రీకాంత్ కి మళ్ళీ మంచి పాత్ర దొరికింది. తన మార్క్ నటనతో అతను కూడా బాగా చేశాడు. దగ్గుబాటి రాజా కూడా చాలా కాలం తర్వాత మంచి పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. సాయి మంజ్రేకర్, బబ్లూ పృథ్వీ రాజ్ , ప్రిన్స్ వంటి వారు పర్వాలేదు అనిపించారు కానీ మరీ గుర్తుపెట్టుకునే విధంగా అయితే వారి పాత్రలు లేవు.

టెక్నికల్ టీం పనితీరు : సినిమాకి చాలా జోనర్లు ఉన్నాయి. కానీ టాలీవుడ్లో స్పెషల్ గా ‘బోయ’ జోనర్ అనేది కూడా యాడ్ అయ్యింది అని అంతా బలవంతంగా అయినా గుర్తుచేసుకోవాలి. అది గుర్తుంచుకునే అతని డైరెక్ట్ చేసిన సినిమాలకు థియేటర్ కి వెళ్ళాలి. ఆ రకంగా వెళ్తే ‘స్కంద’ డిజప్పాయింట్ చెయ్యదు. కానీ బోయపాటి సినిమాలు నచ్చని వాళ్లకి చాలా ప్రశ్నలే ఎదురవుతాయి. ఫైట్స్ మధ్యలో బోయపాటి శ్రీను సినిమా పెట్టాడు ఏంటి? వంటి డౌట్లు చాలానే వస్తాయి. అలాగే హీరోలకి బోయపాటి శ్రీను ఏ రకంగా కథని నేరేట్ చేసి ఓకే చేయించుకుంటాడు అనే ప్రశ్న కూడా రావొచ్చు? అందుకే అతను స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేయలేకపోతున్నాడు అనే ఆన్సర్ కూడా అందరికీ దొరికేస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ పరంగా ‘స్కంద’ పర్వాలేదు అనిపించినా.. సెకండ్ హాఫ్ అయితే బాగా విసిగిస్తుంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫ్యామిలీ సన్నివేశాలు.. షాపింగ్ మాల్ యాడ్స్ ను తలపిస్తాయి తప్ప ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగా ఉండవు. క్లైమాక్స్ లో హడావిడిగా ఇంకో రామ్ ని దింపేసి ఈ టార్చర్ ఇంకా కొనసాగుతుంది అని చెప్పకనే చెప్పాడు బోయపాటి. అతని వర్క్ పక్కన పెడితే . తమన్ సంగీతంలో రూపొందిన పాటలకంటే కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కే కొంచెం మార్కులు పడతాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు.

చివరి మాట : ‘బోయ’ జోనర్ ఒకటి ఉంది అనేది గుర్తుపెట్టుకుంది ‘స్కంద’ సినిమాకి వెళ్తే ప్రాబ్లమ్ లేదు.. కాదు ఇంకేమైనా ఉంటుంది అనుకుని ఆశించి వెళ్తే డిజప్పాయింట్మెంట్ తప్పదు.

రేటింగ్ : 2.25/5

 

Read more : పవన్‌పై రగిలిపోతోన్న వైసీపీ ప్రభుత్వం.. ‘‘బ్రో’’పై జగన్ పగ సాధిస్తారా, వణికిపోతోన్న చిత్ర పరిశ్రమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *