Chenna keshava reddy : ఆ కారణాల వల్లే ‘చెన్నకేశవ రెడ్డి’ సరిగ్గా ఆడలేదు : వినాయక్

News

నందమూరి బాలకృష్ణ డబుల్ రోల్ చేసిన సినిమాల్లో ‘చెన్నకేశవరెడ్డి’ ఒకటి. టబు, శ్రీయ… హీరోయిన్లుగా నటించారు. 2002 సెప్టెంబర్ 25న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. సినిమా బాగానే ఉంటుంది కానీ ఎందుకో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అనుకున్నన్ని అద్భుతాలు చేయలేదు. కానీ బాలకృష్ణ లుక్స్, నటన, మణిశర్మ బి.జి.యం, యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్ అన్నీ సూపర్ గా ఉంటాయి. ఈ సినిమా ఎందుకు ఆడలేదు అన్న విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించాడు దర్శకుడు వినాయక్.

ఈ చిత్రానికి రైటర్ గా అతను పరుచూరి వెంకటేశ్వరరావు ని పెట్టుకున్నాడట. ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకున్నాడట. పరుచూరి బ్రదర్స్ లో మరొకరైన పరిచూరి గోపాలకృష్ణ అప్పటికి ఆయనకు పరిచయం లేడట.వెంకటేశ్వర రావు గారే బాగా పరిచయం కాబట్టి ఆయనతో ట్రావెల్ అయ్యాడట వినాయక్. ‘చెన్నకేశవ రెడ్డి’ వంటి మాస్ సినిమాలు డీల్ చేయడంలో గోపాల కృష్ణ సిద్ధహస్తుడు. ఈ సినిమాకు ఆయన రైటర్ గా పనిచేసి ఉండి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేదని వి.వి.వినాయక్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

అప్పటికి బాలకృష్ణ కెరీర్ లో ఎక్కువ బిజినెస్ చేసిన మూవీ ‘చెన్నకేశవరెడ్డి’ అని, నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టిన మూవీ కూడా అదే అని వినాయక్ తెలిపాడు. రిలీజ్ డేట్ టెన్షన్ కూడా ఆ టైంలో వినాయక్ కు ఎక్కువగా ఉందట. అతని రెండో సినిమాకే బాలకృష్ణ వంటి పెద్ద హీరోతో పనిచేసే అవకాశం దక్కడంతో… కథ పై కంటే కూడా బాలకృష్ణ పాత్ర పైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం కూడా సినిమాకి కొంత మైనస్ అయ్యింది అని వినాయక్ గుర్తుచేసుకుని బాధ పడ్డాడు. అంతేకాదు ఈ సినిమాలో సౌందర్యని హీరోయిన్ గా అనుకున్నాడట. కానీ ఆమె నొ చెప్పడంతో టబు ని తీసుకున్నాడట. అలాగే చెల్లెలి పాత్రకి లయ ను అడిగితే ఆమె ఏడ్చేసిందని వినాయక్ చెప్పుకొచ్చాడు. ఇంకా ఈ చిత్రం గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు.

Read more : సినీ కార్మికుల వేతనాల పెంపు.. చర్చలు మొదలెట్టాం, త్వరలోనే క్లారిటీ : దిల్‌రాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *