అంతలోనే ఎంత మార్పు.. కోలీవుడ్‌కి షాకిచ్చిన నయనతార

News

ఏడేళ్లుగా సాగుతున్న పుకార్లకు, నకిలీ వార్తలకు , సస్పెన్స్‌కు తెరదించుతూ నయనతారం – విఘ్నేష్ శివన్ జంట వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గత వారం చెన్నై సమీపంలోని మహాబలిపురంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఆ తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం వద్ద వీరు చేసిన హడావిడికి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే జరిగిన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

ఈ సంగతి పక్కనబెడితే.. పెళ్లి తర్వాత నయనతార సినిమాలకు దూరమవుతారా.? లేదా ఎప్పటిలాగే కంటిన్యూ చేస్తారా అనే పుకార్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. దీనికి నయన్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. పెళ్లయినా సినిమాలను మాత్రం వదలిపెట్టేది లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే నయనతార దర్శక నిర్మాతలకు షాకిచ్చారు. ఇకపై తన వద్దకు వచ్చే దర్శకనిర్మాతలు గ్లామర్ రోల్స్‌ కోసం కాకుండా హీరోయిన్ ప్రాధాన్యం వున్న కథలతోనే తనను కలవాలని నయనతార కండీషన్ పెట్టారు.

వాస్తవానికి .. నయనతార ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకున్నారు. వయసు మీద పడుతుండటం, స్టార్ స్టేటస్ కారణంగా గత కొంత కాలంగా నయన్ గ్లామర్స్ రోల్స్‌కి దూరంగా ఉంటున్నారు. ఒకవేళ స్టార్‌ హీరోలతో సినిమాలు చేసినా తనకు కొన్ని హద్దులు పెట్టుకుని నటించింది. ఎక్కువ శాతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది.పెళ్లి తర్వాత సినిమాలకు దూరం కాకపోయినా సెలక్టెడ్‌గా మూవీస్ చేయాలనుకుంటోంది నయన్. ప్రస్తుతం ఈమె చేతిలో తెలుగు, తమిళ, హిందీ సినిమాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *