చిరంజీవిపై సంచలన ఆరోపణలు : జీవిత, రాజశేఖర్ దంపతులకు జైలు శిక్ష.. కోర్ట్ సంచలన తీర్పు

టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ జీవిత, రాజశేఖర్‌లు చిక్కుల్లో పడ్డారు. పరువు నష్టం కేసులో వీరిద్దరికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో వారిద్దరికి జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్ నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ తీర్పును వెలువరించారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తున్న బ్లాడ్‌బ్యాంక్‌పై వారు చేసిన ఆరోపణలకు గాను దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం రాజశేఖర్, జీవితలకు జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించింది. అలాగే అప్పీల్‌కు అవకాశం ఇస్తూ.. బెయిల్ […]

Continue Reading

పవన్‌పై రగిలిపోతోన్న వైసీపీ ప్రభుత్వం.. ‘‘బ్రో’’పై జగన్ పగ సాధిస్తారా, వణికిపోతోన్న చిత్ర పరిశ్రమ

ప్రస్తుతం ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వానికి వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వారాహి యాత్రలో భాగంగా జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు పవన్ కల్యాణ్. తాజాగా ఆయన వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనికి తోడు జగన్‌ను ఏకవచనంతోనే పిలుస్తానని.. ఇకపై ఆయనకు గౌరవం ఇవ్వనని పవన్ తేల్చిచెప్పారు. దీంతో ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు పవన్‌ కళ్యాణ్‌ను గట్టిగా టార్గెట్ చేశారు. ఇదే […]

Continue Reading

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూత

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఇకలేరు. ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు విశాఖ నుంచి వస్తుండగా వడదెబ్బకు గురైన రాకేష్ మాస్టర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం క్షీణించి రక్ష విరేచనాలు సైతం చేసుకున్నారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, […]

Continue Reading

టాలీవుడ్ నన్ను బాగా చూసుకోంది.. కానీ కోలీవుడ్‌లో ఆ హీరో మాత్రం : నిత్యా మీనన్ హాట్ కామెంట్స్

ఇటీవలి కాలంలో సీనియర్ హీరోయిన్లు, ప్రస్తుత హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరిలో స్టార్ హీరోయిన్ల నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు బాధితులుగా వున్నారు. అవకాశాలు ఇస్తామనే వంకతో దర్శక నిర్మాతలు తమను కమిట్‌మెంట్ అడుగుతున్నారని ఎంతోమంది మీడియాలో, సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరారు నిత్యమీనన్. సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న నిత్య మీనన్.. కథాబలం వున్న సినిమాలనే ఎంచుకుంటూ, అందాల ఆరబోతకు దూరంగా వుంటున్నారు. నవరసాలను అద్భుతంగా […]

Continue Reading

Sarath Babu : పోలీస్ అవుదామనుకున్న కలను చిదిమేసిన లోపం .. శరత్ బాబు జీవితంలో ఎత్తుపల్లాలెన్నో..?

అలనాటి దిగ్గజ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో ఈరోజు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజులుగా హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో సోమవారం కన్నుమూశారు. ఆయన మరణవార్తతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శరత్ బాబు కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత విషయాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జన్మించిన శరత్ బాబు అసలు […]

Continue Reading

బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోలో చిరంజీవి … గట్టి ప్రయత్నాల్లో అల్లు అరవింద్..?

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సారథ్యంలో ప్రారంభమైన ‘‘ఆహా’’ ఓటీటీకి మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. రియాలిటీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఒరిజిన్స్‌లతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. వీటిలో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన ‘‘అన్‌స్టాపబుల్’’ షోకి మంచి పేరు వచ్చింది. బాలయ్య లాంటి అగ్రహీరో తొలిసారి ఇలాంటి వేదికలపై రావడంతో ఈ షోకి ఎక్కడా లేని బజ్ వచ్చింది. ముఖ్యంగా స్టార్స్‌ని ఆయన డీల్ చేసిన విధానం ప్రజలకు బాగా నచ్చింది. […]

Continue Reading

కంటతడి పెట్టిస్తోన్న అడివి శేష్ బ్రేకప్ స్టోరీ.. పాపం, బర్త్ డే నాడే అలా..!!

గాడ్ ఫాదర్ ఎవరు లేకున్నా.. స్వయంకృషి, పట్టుదల, ప్రతిభతో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్‌గా ఎదిగిన వారిలో అడివి శేష్ ఒకరు. చిన్నాచితకా పాత్రలు చేస్తూనే హీరోగా మెప్పించారు. అలాగే రైటర్‌గా, దర్శకుడిగా సత్తా చాటుతున్నారు. 26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథతో తెరకెక్కిన ‘‘మేజర్’’ సినిమాతో అడివి శేష్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఈ సినిమాలో ఆయన నటన, యాక్షన్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ […]

Continue Reading

తేడా కొడుతున్న ‘‘చిరు’’ సినిమాలు, ఇక వినయ్ దిగాల్సిందేనా.. మెగా క్యాంప్‌లో అంతర్మథనం

సెకండ్ ఇన్నింగ్స్‌లో ఒక్క ఖైదీ నెంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవికి సరైన హిట్ లేదు. సైరా నర్సింహారెడ్డి, ఆచార్య సినిమాలు మెగా అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో మెగా క్యాంప్‌లో ఆందోళన నెలకొంది. దీంతో చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్‌లు గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేర్ వీరయ్య తదితర సినిమాల భవితవ్యంపై చర్చ మొదలైంది. దీంతో చిరు ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లన్నీ పూర్తయిన తర్వాత […]

Continue Reading

అంతలోనే ఎంత మార్పు.. కోలీవుడ్‌కి షాకిచ్చిన నయనతార

ఏడేళ్లుగా సాగుతున్న పుకార్లకు, నకిలీ వార్తలకు , సస్పెన్స్‌కు తెరదించుతూ నయనతారం – విఘ్నేష్ శివన్ జంట వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గత వారం చెన్నై సమీపంలోని మహాబలిపురంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఆ తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం వద్ద వీరు చేసిన హడావిడికి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే జరిగిన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సంగతి పక్కనబెడితే.. పెళ్లి తర్వాత నయనతార సినిమాలకు […]

Continue Reading