‘మాటరాని మౌనమిది’ మూవీ రివ్యూ

Reviews

‘శుక్ర’ తర్వాత దర్శకుడు సుకు పూర్వాజ్ రూపొందించిన చిత్రం ‘మాటరాని మౌనమిది’. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి సూపర్ హిట్ టాక్ వస్తుంది. మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి వంటి వారు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో ‘కార్తీక దీపం’ ఫేమ్ అర్చన అనంత్ కూడా ముఖ్య పాత్ర పోషించారు.

ఇదొక హారర్ కథాంశంతో కూడిన మిస్టరీ థ్రిల్లర్ అని ట్రైలర్ ద్వారా రివీల్ చేసింది చిత్ర యూనిట్. రామ్ అలియాస్ మహేష్ దత్తా చాలా కాలం తర్వాత తన అక్క, బావ అలియాస్ ఈశ్వర్ లను చూడాలని వాళ్ళ ఇంటికి వెళ్తాడు.అయితే వాళ్ళ అక్క లేదు అనే న్యూస్ తెలుసుకొని అతను షాక్ కి గురవుతాడు.కానీ రామ్‌ని తన బావ చాలా బాగా చూసుకుంటాడు. ఇదే టైములో అతను ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు.ఆ అమ్మాయి మూగ అమ్మాయి. తర్వాత రామ్ బావ ఏదో పని మీద బయటకు వెళ్తాడు. రామ్ ఒంటరిగా ఉన్న ఆ టైంలో బెల్ కొట్టిన శబ్దం వినిపిస్తుంది. ఆ బెల్ కొట్టింది ఎవరు. ఆ టైంలో ఏం జరిగింది. ఆ సమస్య ఏంటి అనే సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ..ఈ చిత్రం తెరకెక్కింది.

మహేష్ దత్తా,శ్రీహరి ఉదయగిరి ఇద్దరూ చాలా బాగా నటించారు. సోని శ్రీవాస్తవ కూడా చాలా బాగా నటించింది. చందు, సంజీవ్, అర్చన అనంత్, కేశవ్, సుమన్ శెట్టి అందరూ చాలా బాగా నటించారు.

దర్శకుడు సుకు పువ్‌రాజ్ ‘శుక్ర’ తర్వాత మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ‘మాటరాని మౌనమిది’ ని ఆవిష్కరించారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఎంగేజింగ్ గా సాగుతుంది ఈ కథ. సంగీతం, నేపథ్య సంగీతం బాగా కుదిరింది. నిర్మాతలు కూడా ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారని విజువల్స్ చెబుతున్నాయి.సెకండాఫ్‌లో కొంత ల్యాగ్‌ ,లీడ్ ఆర్టిస్ట్ లు కొత్త మొహాలు కావడం.. తప్ప అందరినీ ఎంగేజ్ చేసే మూవీనే ఇది. హారర్, థ్రిల్లర్ మూవీస్ ను ఇష్టపడే వాళ్లకు ‘మాటరాని మౌనమిది’ తప్పక నచ్చుతుందని విశ్లేషకులు, ప్రేక్షకులు తెలిపారు.

రేటింగ్ : 3/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *