‘పీఎస్-2 ‘ రివ్యూ అండ్ రేటింగ్

Reviews

విడుదల తేదీ : ఏప్రిల్ 28 2023

తారాగణం : విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మీ, ప్రకాష్ రాజ్, పార్తీబన్, ప్రభు, జయరామ్, విక్రమ్ ప్రభు, శరత్ కుమార్, రెహమాన్, లాల్, నాజర్, కిశోర్ తదితరులు

దర్శకత్వం : మణిరత్నం

సంగీతం : ఏ ఆర్ రెహమాన్

సినిమాటోగ్రఫీ : రవివర్మన్

నిర్మాత : మణిరత్నం, సుభాస్కరన్

నిర్మాణ సంస్థ :  ‘మద్రాస్ టాకీస్’ ‘లైకా ప్రొడక్షన్స్’

 

చాలా వరకు ఫేడౌట్ దశకు చేరుకున్న లెజెండరీ దర్శకుడు మణిరత్నం తన డ్రీం ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియన్ సెల్వన్‘ మొత్తానికి వెండితెర పై ఆవిష్కరించగలిగాడు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని ఆయన తీర్చిదిద్దగా.. ఫస్ట్ పార్ట్ ‘పీఎస్-1’ పేరుతో గత ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యింది. ఇక రెండో భాగం ‘పీఎస్-2’ పేరుతో ఈరోజు అనగా ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యింది. ఫస్ట్ పార్ట్ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. సెకండ్ పార్ట్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

పాండ్యుల దాడి చేయడంతో సముద్రంలో పడిపోయిన పొన్నియన్ సెల్వన్ (జయం రవి) & వల్లవరాయన్ (కార్తీ)లను మందాకిని (రెండో ఐశ్వర్యరాయ్) రక్షిస్తుంది.ఇక నందిని(మొదటి ఐశ్వర్యరాయ్) మరియు పాండ్యులు కలిపి చోళ రాజ్యాన్ని కిందికి దించి తమ జెండా ఎగురవేసేందుకు..రెడీ అవుతారు. ఈ క్రమంలో ఆదిత్య కరికాలుడ్ని (విక్రమ్) అడ్డు తొలగించుకునేందుకు కూడా సిద్ధపడతారు. మరి ఫైనల్ గా వారు అనుకున్నది జరిగిందా? అసలు ఈ నందిని, మందాకినీ ఒకేలా ఎందుకున్నారు? వాళ్ళు ఎవరు? పొన్నియన్ సెల్వన్ ను మందాకిని ఎందుకు ప్రతిసారి కాపాడుతూ వస్తుంది. వల్లవరాయన్ .. పొన్నియన్ సెల్వన్ కు ఎలాంటి సాయం చేశాడు అన్నది తెర పై చూడాల్సిన కథ.

మొదటి భాగం చాలా మందికి నచ్చి ఉండదు. ఎందుకంటే మొదటి పార్ట్ లో ఎక్కువ పాత్రల పరిచయం, వారి ఉద్దేశం తెలపడానికే సరిపోయింది. అసలైన డ్రామా అంతా సెకండ్ పార్ట్ లో ఉంది. అందుకే ‘పీఎస్-2 ‘ ఫస్ట్ పార్ట్ ను చూసిన వాళ్ళు తప్పకుండా చూడాలి అని చెప్పాలి. ఇది మన నేటివిటీతో కూడిన కథ కాదు. కానీ మన తెలుగులో తీసిన ‘బాహుబలి’ కి మూలం ‘పొన్నియన్ సెల్వన్’ అనడంలో అతిశయోక్తి లేదు. మణిరత్నం డిటైలింగ్ ఎక్కువగా ఉండటం, నిడివి కూడా 2 గంటల 40 నిముషాలు పైబడి ఉండటంతో ‘పొన్నియన్ సెల్వన్-2 ‘ కాస్త విసిగిస్తుంది అన్నది వాస్తవం. వి.ఎఫ్.ఎక్స్ విషయంలో మాత్రం ఫస్ట్ పార్ట్ కంటే వెనుకబడి ఉంది ఈ ‘పీఎస్-2 ‘. కార్తీ, విక్రమ్ పోటీపడి నటించారు. త్రిష,ఐశ్వర్య రాయ్ తమ గ్లామర్ తో మరోసారి మాయ చేశారు. మిగిలిన పాత్రలు జస్ట్ ఓకె. ఏ.ఆర్.రెహమాన్ ఫస్ట్ పార్ట్ కంటే బెటర్ మ్యూజిక్ ఇచ్చాడు. కానీ పాటలైతే పెద్దగా గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా ఓకె.

 

ఓవరాల్ గా ‘పీఎస్-1 ‘ కంటే కూడా ‘పీఎస్ -2 ‘ బెటర్ గానే ఉంటుంది.అలా అని బోర్ కొట్టని అంశాలు అయితే లేవు అని చెప్పడం కరెక్ట్ కాదు. మణిరత్నం మార్క్ స్టోరీ టెల్లింగ్ ను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

 

Read more : agent review : ఏజెంట్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *