agent review : ‘ఏజెంట్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Reviews

విడుదల తేదీ : ఏప్రిల్ 28 2023
తారాగణం : అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి, భరత్ రెడ్డి, వరలక్ష్మీ శరత్ కుమార్, సంపత్ రాజ్ తదితరులు  తదితరులు
దర్శకత్వం : సురేందర్ రెడ్డి
సంగీతం : హిప్ హాప్ తమిళ, భీమ్స్ (వైల్డ్ సాలా సాంగ్)
సినిమాటోగ్రఫీ :
నిర్మాత : రామబ్రహ్మం సుంకర
నిర్మాణ సంస్థ :  ‘ఏ కె ఎంటర్టైన్మెంట్స్’ ‘సురేందర్ 2 సినిమా’

నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 5వ సినిమా ‘ఏజెంట్’. అతను నటించిన గత 4 సినిమాల్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తప్ప మిగిలినవి చెప్పుకోదగ్గ విజయాలు కాదు.  అయితే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అయ్యి.. అతనికి స్టార్ స్టేటస్ ను తీసుకొస్తుందని అంతా నమ్మారు. ముఖ్యంగా అక్కినేని అభిమానులు ‘ఏజెంట్’ తో అఖిల్ మాస్ హీరోగా ఎదుగుతాడని భావించారు. మరి వారి నమ్మకం నిజమైందో లేదో చూద్దాం రండి :

బాల్యంలో తన కళ్ళముందే తనకు ఇష్టమైన వాళ్లంతా బాంబ్ బ్లాస్ట్ లో చనిపోవడంతో..రా ఏజెంట్ కావాలని కలలుగంటూ.. అందుకు తగ్గట్లు ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు రిక్కీ అలియాస్ రామకృష్ణ(అఖిల్). అందుకు రా ఏజెన్సీ చీఫ్ మహదేవ్ (మమ్ముట్టి)ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాడు.అనేక ప్రయత్నాల తర్వాత ఒక సీక్రెట్ మిషిన్ తో రంగంలోకి దిగుతాడు రిక్కీ. ఆ తర్వాత అతనికి ఎదురైన అనుభవాలు, మరో పక్క వైద్య(సాక్షి వైద్య) తో ప్రేమాయణం. ఇదే ‘ఏజెంట్’ కథ గురించి చెప్పుకునేది.

అఖిల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అని ప్రతి ఫ్రేమ్ లోనూ తెలుస్తుంది. అతని స్క్రీన్ ప్రెజెన్స్, అతను చేసిన యాక్షన్ సన్నివేశాలు, డాన్స్ లు.. ఇలా అన్నిటిలో అఖిల్ ఆకట్టుకున్నాడు. కానీ ఇంకా అతని హావభావాలు ఆకట్టుకునే విధంగా లేవు. మమ్ముట్టికి ఇలాంటి పాత్ర ఇచ్చారేంటి అనిపిస్తుంది. ఈ పాత్రలో ఏం నచ్చి మమ్ముట్టి నటించడానికి ఒప్పుకున్నాడో ఆయనకే తెలియాలి. ఆయన మార్క్ సినిమాలో కంప్లీట్ గా మిస్ అయ్యింది. ఆయన ప్రమోషన్స్ కు రాకపోవడానికి ఇది కూడా ఓ కారణమై ఉండొచ్చు.

సురేందర్ రెడ్డి డైరెక్షన్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ విషయాన్ని ఇంకా ఆయన గ్రహించడం లేదు. అందరూ పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు నేను కూడా తీయాలి అనే ఆత్రం తప్ప.. సురేందర్ రెడ్డి తన బాలలను నమ్మడం మానేశాడు అని ఈ చిత్రం ద్వారా అర్ధం చేసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ కొద్దో గొప్పో కూర్చోవచ్చు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం జనాల సహనానికి పరీక్ష అని చెప్పాలి. పాటలు ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేవు. సినిమాటోగ్రఫీ కూడా స్పెషల్ గా చెప్పుకునే విధంగా అయితే ఏమీ లేదు. ఈ మధ్య కాలంలో కంప్లీట్ డిజాస్టర్ అంటే అది ‘ఏజెంట్’ అనే చెప్పాలి.

రేటింగ్ :2/5

Read more : విరూపాక్షమూవీ రివ్యూ అండ్ రేటింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *