dire hard fan review

Die Hard Fan: ‘డై హార్డ్ ఫ్యాన్’ మూవీ రివ్యూ

Reviews

నటీనటులు: ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నొయ‌ల్ తదితరులు

దర్శకుడు: అభిరామ్ M

బ్యానర్: శ్రీహాన్ సినీ క్రియేషన్స్

నిర్మాత: చంద్ర ప్రియ సుబుద్ది

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ కింతలి

మాటలు: సయ్యద్ తాజుద్దీన్

సంగీతం: మధు పొన్నాస్

సినిమాటోగ్రఫీ: జగదీష్ బొమ్మిశెట్టి

డై హార్డ్ ఫ్యాన్. ఈ పదం ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రంతో ఫేమస్ అయ్యింది. ఆ చిత్రం నుండి వదిలిన ఫస్ట్ టీజర్ లోనే ఈ డైలాగ్ ఉండడం.. అది పెద్ద ఎత్తున ఫేమస్ అవ్వడం జరిగింది. అదే టైటిల్ తో సినిమా వస్తుంది అని తెలిసిన వెంటనే.. అందరిలోనూ ఆసక్తి నెలకొంది.టైటిల్ తోనే ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసి జనాల అటెన్షన్ డ్రా చేసింది. ప్రచార చిత్రాలు కూడా బాగుండడంతో సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టు సినిమా ఉందా? లేదా? తెలుసుకుందాం రండి :

కథ : సినిమా వాళ్ళు జనాలను బాగా ఆకర్షిస్తారు అనేది నిజం.హీరోలతో పాటు హీరోయిన్లను కూడా పిచ్చిగా అభిమానించే అభిమానులు ఉంటారు.అలాంటి ఓ అభిమాని శివ (శివ ఆలపాటి). ఇతను త‌న అభిమాన హీరోయిన్‌ (ప్రియాంక శర్మ )ను   క‌ల‌వాల‌నుకుంటాడు.ఒక సెలబ్రిటీ గా ఆమె ఏ వేడుకకు వెళ్లినా ఇతను కూడా వెళ్తుంటాడు.ఆమె పుట్టినరోజు వేడుకను కూడా ఘనంగా నిర్వహించాలి.. అలా ఆమెను ఆకర్షించాలి అనుకుంటాడు. ఎంతో గ్రాండ్ గా ఆ వేడుకను ప్లాన్ చేస్తున్న శివకు అదే రోజున ఊహించని విధంగా ఓ షాక్ తగులుతుంది. అదేంటి అంటే తన అభిమాన హీరోయిన్ పుట్టినరోజు నాడే శివ పర్సనల్  అకౌంట్ నుండి ఓ మెసేజ్ వస్తుంది. అతను ఆ షాక్ లో ఉండగానే తన అభిమాన హీరోయిన్ డైరెక్ట్ గా శివ ఫ్లాట్ కు వచ్చి సర్ప్రైజ్ చేస్తుంది. శివ అభిమానించే హీరోయిన్ అతని ఇంటికి వెళ్లడం ఏంటి? దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా?ఆమె వలన శివకి ఏమైనా ప్రాబ్లమ్ ఏర్పడిందా? వంటి విషయాలు తెలియాలంటే బిగ్ స్క్రీన్ పై సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు : ప్రియాంక శర్మ ఓ సెలబ్రిటీగా తన లుక్స్ తో, నటనతో ఆకట్టుకుంది.రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రను ఈమె చక్కగా పోషించింది.  డై హార్డ్ ఫ్యాన్ గా శివ ఆలపాటి చాలా ఈజ్ తో నటించాడు, అతని ఎనర్జీ కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు. పొలిటిషియన్ పాత్రలో బేబమ్మ గా నటించిన షకలక శంకర్ తన మార్క్ కామెడీతో ఆకట్టుకున్నాడు.లాయర్ కృష్ణ కాంత్ పాత్రలో రాజీవ్ కనకాల ఎప్పటిలానే సూపర్ గా నటించాడు. డైనమిక్ లాయర్ గా ,ఆదిత్య పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా నొయ‌ల్ కూడా సూపర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఇంకా కేశవ్ దీపక్, రవి వర్మ,ఆలపాటి లక్ష్మి, అప్పారావు ఇలా అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు అభిరామ్ ఎంచుకున్న కథ.. దానిని మలిచిన తీరు బాగుంది. రెగ్యులర్ సినిమాల్లానే ప్రారంభమైనప్పటికీ తర్వాత ప్రతి పది నిమిషాలకు ఒక ట్విస్ట్ & టర్న్స్ అన్నట్టు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ రూపొందింది. హీరోయిన్ కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ ను కామెడీతో అతను యూత్ కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించాడు.  నేపథ్య సంగీతం విషయంలో సుకుమార్ వద్ద పని చేసిన మధు పొన్నాస్ మంచి మార్కులు వేయించుకున్నాడు.జగదీష్ బొమ్మిశెట్టి  సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలెట్ అని చెప్పొచ్చు.తిరు ఎడిటింగ్, వి. యఫ్. ఎక్స్ బాగున్నాయి. నిర్మాత చంద్ర ప్రియ సుబుద్ధి ,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్ కింతలి ఖర్చుకు వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.

చివరి మాట :  మొత్తంగా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించే ఎలిమెంట్స్ ఈ ‘డై హార్డ్ ఫ్యాన్’ లో ఉన్నాయి.ఈ వీకెండ్ కు థియేటర్ కి వెళ్ళాలి అనుకునే వారికి ఈ ‘డై హార్డ్ ఫ్యాన్’ కూడా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. థియేటర్లో మిస్ అయితే ఓటీటీలో అయినా మిస్ కాకుండా చూసే మూవీ ఇది.

 

రేటింగ్ :3/5

 

Read more : సినీ కార్మికుల వేతనాల పెంపు.. చర్చలు మొదలెట్టాం, త్వరలోనే క్లారిటీ : దిల్‌రాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *