Ghost Movie Review in Telugu : ‘ఘోస్ట్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

News Reviews

విడుదల తేదీ : 04 నవంబర్ 2023
తారాగణం : డాక్టర్ శివరాజ్ కుమార్, అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయన్, అర్చనా జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న మరియు తదితరులు తదితరులు
దర్శకత్వం : శ్రీని
సంగీతం : అర్జున్ జన్య
సినిమాటోగ్రఫీ : మహేంద్ర సింహ
నిర్మాత : సందేశ్ ఎన్
నిర్మాణ సంస్థ :  సందేశ్ ప్రొడక్షన్స్ (31 వ చిత్రం)

కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘ఘోస్ట్’. దసరా కానుకగా కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ బాక్సాఫీస్ వద్ద ఇంకా సక్సెస్ ఫుల్ గా రాణిస్తుంది. అయితే తెలుగులో కాస్త క్రేజ్ ఉన్న సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఇక్కడ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకి ఈరోజున తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. మరి తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం :

కథ : మాజీ సీబీఐ అధికారి అయిన వామన్ శ్రీనివాస్ (ప్రశాంత్ నారాయణన్) జైళ్ల ప్రయివేటీకరణ కొరకు ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఫైనల్ గా తనకి ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో 10 ఏళ్ల తర్వాత అనుమతి రప్పించుకుంటాడు. తర్వాత భూమి పూజ కోసమని వామన్ జైలుకి వెళ్లగా అక్కడ ఓ గ్యాంగ్ వారిని కిడ్నాప్ చేయడం జరుగుతుంది. వామన్ కేసుని సాల్వ్ చేయడానికి జయరామ్ అనే ఎసిపి సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు. అతని దర్యాప్తులో వామన్ అండ్ గ్యాంగ్ ని కిడ్నాప్ చేసింది బిగ్ డాడీ (శివ రాజ్ కుమార్) అనే గ్యాంగ్స్టర్ అని తెలుస్తుంది. అతనితో చరణ్ కి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కాబట్టి… బిగ్ డాడీని ఓడించడం అనేది కష్టమని అతనికి అర్ధమవుతుంది. దీంతో జైల్లో ఉన్న రౌడీలా సాయం తీసుకుని బిగ్ డాడీని చంపేయాలని భావిస్తాడు. కానీ ఈ ప్రాసెస్ లో ఆ గ్యాంగ్స్టర్ బిగ్ డాడీ కాదు అని తేలుతుంది. చివరికి ఏం జరిగింది అనేది కథ.

ఎవరెలా చేసారు అంటే : శివ రాజ్ కుమార్ తన మాస్క్ పెర్ఫార్మన్స్ తో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. అతని ఎలివేషన్ సీన్లు మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. మరీ ముఖ్యంగా సీఎం కొడుకుని చంపే సీన్లో అతను చూపించిన ఆటిట్యూడ్ కి.. ఇతను ‘ట్రూ మాస్ గాడ్’ అనిపిస్తుంది. ఇక జయరాం కూడా చాలా బాగా నటించాడు. అనుపమ్ కేర్ గెస్ట్ రోల్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కె.జి.ఎఫ్ లో హీరో తల్లిగా చేసిన అర్చనా జోయస్ కూడా బాగా నటించింది. కానీ ఆమె పాత్రలో ఇంకాస్త డెప్త్ ఉంటే బాగుండేది. సత్యరాజ్ కూడా ఎప్పటిలాగే తనకి అలవాటైన గ్రే షేడ్ రోల్ చేశాడు. కానీ కొత్తగా ఏమీ అనిపించదు.

టెక్నికల్ టీం పనితీరు : దర్శకుడు  శ్రీని హీరో శివరాజ్ కుమార్ ను రెండు షేడ్స్ లో ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. సెకండ్ హాఫ్ ను అతను బాగా డీల్ చేశాడు.సెకండ్ పార్ట్ పై కూడా హోప్స్ పెంచాడు. అర్జున్ జన్య అందించిన నేపధ్య సంగీతం సూపర్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

చివరి మాట : మాస్ ఆడియన్స్ ను ‘ఘోస్ట్’ ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవాలి.

 

 

రేటింగ్ : 2.5/5

 

Read more : priyamani : ప్రియమణితో 4 ఏళ్ళు ఎఫైర్ నడిపిన హీరో ఎవరో తెలుసా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *