Ranga Ranga Vaibhavanga review

Ranga Ranga Vaibhavanga Review : ‘రంగ రంగ వైభవంగా’ సినిమా రివ్యూ & రేటింగ్! 

Reviews

Release Date: సెప్టెంబర్ 2, 2022
Starring: పంజా వైష్ణ‌వ్ తేజ్, కేతిక శర్మ, ప్రభు, నరేష్, ప్రగతి,సత్య, రాజా రవీంద్ర, నవీన్ చంద్ర,సుబ్బరాజు తదితరులు..
Director: గిరీశాయ
Music Director: దేవి శ్రీ ప్రసాద్
Cinematography: శాందత్
Producer: బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్
Banner: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర

 

‘ఉప్పెన’ తో డెబ్యూ మూవీతోనే బ్లాక్ బస్టర్ ను అందుకుని రికార్డులు క్రియేట్ చేశాడు పంజా వైష్ణవ్ తేజ్. ఆ చిత్రం రిలీజ్ అవ్వకుండానే ‘కొండపొలం’ అనే చిత్రాన్ని కూడా ఫినిష్ చేశాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది. అది ఓటీటీ కోసం తీసిన సినిమా కాబట్టి జనాలు అంతగా పట్టించుకోలేదు. అయితే టీవీల్లో బాగానే చూశారు. స్టార్ మా లో మంచి టి.ఆర్.పి నమోదు చేసింది ఆ మూవీ. సో ఆ చిత్రం ఫలితం గురించి పట్టించుకోకుండానే ‘రంగ రంగ వైభవంగా’ అనే చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు వైష్ణవ్. అర్జున్ రెడ్డిని తమిళంలో రీమేక్ చేసి హిట్టు కొట్టిన దర్శకుడు కావడం, టీజర్ కు మంచి స్పందన రావడంతో సినిమా పై మంచి బజ్ ఏర్పడింది. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందో లేదో చూద్దాం రండి :

కథ : ఇద్దరు ప్రాణ స్నేహితులు.. తమ కుటుంబాలతో పక్క పక్క ఇళ్లల్లోనే నివసిస్తూ ఉంటారు. ఇల్లులు మాత్రం వేరైనా ఒకే కుటుంబంలా కలిసుంటారు. హీరో హీరోయిన్లు ఒకే హాస్పిటల్ లో పుడతారు. కలిసి పెరుగుతారు. చిన్న గొడవ వచ్చి విడిపోతారు. తర్వాత మరో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కలుస్తారు. వాళ్ళు కలిసి ఒక పాట వచ్చిన వెంటనే మళ్ళీ విడిపోతారు. ఈసారి వాళ్ళు విడిపోవడానికి కారణాలు ఏంటి? చివరికి వాళ్ళు ఎలా కలుసుకున్నారు? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు :ఋషి పాత్రలో వైష్ణవ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. అతనిలో మంచి ఎనర్జీ ఉంది. మెగా హీరోలందరి కంటే ఇతనిలో మంచి స్పార్క్ ఉంది. కానీ ఇతనికి ఇంకా సరైన సినిమా పడలేదు. ‘రంగ రంగ వైభవంగా’ కూడా ఆ లోటుని తీర్చే సినిమా కాదు. వరుస సినిమాల్లో నటించాలి అనే ఉత్సాహం పక్కన పెట్టి మంచి పాత్రలు ఎంచుకుంటే ఇతనికి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది.ఎందుకంటే అతని స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. రాధ పాత్రలో కేతిక శర్మ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆమె లుక్స్ పెద్దగా ఇంప్రెసివ్ గా లేవు. రిపీటెడ్ ఎక్స్ప్రెషన్లతోనే లాగించేసింది. నవీన్ చంద్ర రోల్ పర్వాలేదు. నరేష్, ప్రభు పాత్రలు రొటీన్ గానే ఉన్నాయి. మిగిలిన పాత్రలు పెద్దగా గుర్తుండవు.

సాంకేతిక నిపుణుల పనితీరు : ‘అర్జున్ రెడ్డి’ ని తమిళ్ లో రీమేక్ చేసి హిట్టు కొట్టాడు అంటే గిరీశాయలో మంచి టాలెంట్ ఉంది అని అంతా అనుకున్నారు. ‘రంగ రంగ వైభవంగా’ చిత్రం పై బజ్ ఏర్పడడానికి ఇతను కూడా ఓ కారణం. కానీ ఇతను ఎంపిక చేసుకున్న కథ 1990 ల కాలం నాటిది. ‘నిన్నే పెళ్లాడతా’ నుండి ‘నువ్వే కావాలి’ ‘నువ్వు లేక నేను లేను’ ‘ఖుషి’ ‘డార్లింగ్’ ‘రామ రామ కృష్ణ కృష్ణ’ ‘100%లవ్’ ‘రంగ్ దే’ ఇలా ఏదో ఒక చిత్రాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. టెక్నీకల్ టీంకి మాత్రం మంచి మార్కులు వేయొచ్చు. శాందత్ సినిమాటోగ్రఫీ బాగుంది. దేవి శ్రీ ప్రసాద్ రెండు మంచి పాటలు ఇచ్చాడు. నేపధ్య సంగీతం కూడా పర్వాలేదు. ఫస్ట్ హాఫ్ లో సుబ్బరాజు బ్యాచ్ తో హీరో చేసే ఫైట్ బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.

చివరి మాట : వీకెండ్ కు ఏదో ఒక సినిమా చూడాలి అనుకుని థియేటర్ కు వెళ్లిన బ్యాచ్ కు ఈ మూవీ సినిమా చూసిన ఫీలింగ్ ను అయితే కలిగించదు. యూట్యూబ్ లోని సెర్చ్ రిజల్ట్స్ లో ఒక్కో సినిమాలో ఒక్కో సీన్ చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది.

రేటింగ్ : 2.25/5

Read more: Die Hard Fan: ‘డై హార్డ్ ఫ్యాన్’ మూవీ రివ్యూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *