టాలీవుడ్ నన్ను బాగా చూసుకోంది.. కానీ కోలీవుడ్‌లో ఆ హీరో మాత్రం : నిత్యా మీనన్ హాట్ కామెంట్స్

News

ఇటీవలి కాలంలో సీనియర్ హీరోయిన్లు, ప్రస్తుత హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరిలో స్టార్ హీరోయిన్ల నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు బాధితులుగా వున్నారు. అవకాశాలు ఇస్తామనే వంకతో దర్శక నిర్మాతలు తమను కమిట్‌మెంట్ అడుగుతున్నారని ఎంతోమంది మీడియాలో, సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరారు నిత్యమీనన్. సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న నిత్య మీనన్.. కథాబలం వున్న సినిమాలనే ఎంచుకుంటూ, అందాల ఆరబోతకు దూరంగా వుంటున్నారు. నవరసాలను అద్భుతంగా పలికించగల ఈ తరం నటీమణుల్లో ఒకరిగా నిత్యామీనన్ గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిత్యా మీనన్ చెప్పిన మాటలు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. అది కూడా తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించినది కావడంతో కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఏమన్నారంటే… తెలుగు చిత్రసీమకు సంబంధించి తనకు అంతా ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవారని తెలిపింది. అక్కడ తనకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చింది. కానీ ఒక తమిళ హీరో మాత్రం పదే పదే తనను అసభ్యంగా తాకుతూ ఇబ్బందిపెట్టేవాడని నిత్యామీనన్ ఆరోపించింది. అతని ప్రవర్తన కారణంగా ఆ సినిమాను పూర్తిచేయడం కష్టమైపోయిందని నిత్యా మీనన్ చెప్పుకొచ్చింది. అయితే ఆమె తమిళంలో ఎన్నో సినిమాలు చేశారు. మరి నిత్యను అంతగా ఇబ్బంది పెట్టింది ఎవరా అంటూ అభిమానులు, సినీ ప్రముఖులు చర్చించుకుంటున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *