vyooham review : ‘వ్యూహం’ సినిమా రివ్యూ అండ్ రేటింగ్

Reviews News Uncategorized

నటీనటులు: అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితరులు
నిర్మాణ సంస్థ: రామదూత క్రియేషన్స్‌
నిర్మాత: దాసరి కిరణ్‌ కుమార్‌
రచన-దర్శకత్వం: రామ్‌ గోపాల్‌ వర్మ
సంగీతం: ఆనంద్
సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్
విడుదల తేది: మార్చి 2, 2024

పొలిటికల్ సినిమాలకి బాగా డిమాండ్ ఎక్కువ. పైగా ఇది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల టైం. ఆల్రెడీ ‘యాత్ర 2 ‘ ‘రాజధాని ఫైల్స్’ వంటి సినిమాలు వచ్చాయి. కానీ అవి ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అయ్యాయి. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ పైనే అందరి దృష్టి పడింది. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆయన తనయుడు కొత్త పార్టీ పెట్టడం, దానిని బలోపేతం చేసి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు అనే అంశాన్ని తీసుకుని రామ్‌ గోపాల్‌ వర్మ ‘వ్యూహం’ ని మలిచాడు.  ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి :

కథ : వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత జగన్ ఎదుర్కొన్న సమస్యలను ఆధారం చేసుకుని ‘వ్యూహం’ రూపొందింది. ఎన్నికల టైం కాబట్టి పేర్ల విషయంలో వర్మ ఫిక్షన్ ను జోడించడం జరిగింది. వీర శేఖర్ రెడ్డి మరణం అనంతరం  పార్టీ చెల్లాచెదురు కాకుండా మదన్‌(అజ్మల్‌ అమీర్‌) ముఖ్యమంత్రిగా కావాలని 150కి పైగా ఎమ్మెల్యేల మద్ధతు ఇస్తారు. దానిని భారత్‌ పార్టీ (కాంగ్రెస్‌) మేడం (సోనియా) వ్యతిరేకించి కాశయ్య ని ముఖ్యమంత్రిగా నియమిస్తుంది. అంతేకాదు మదన్ చేపట్టిన ఓదార్పు యాత్రని కూడా ఆపేయాలంటూ ఆదేశించగా, అతను విననందున .. ఐటీ రైడ్స్, కేసులు బనాయించి అతన్ని జైలు పాలు చేస్తుంది. ఈ క్రమంలో ఇంద్రబాబు  (ధనుంజయ్‌ ప్రభునే) పన్నిన వ్యూహం ఏంటి..? 2014లో ఇంద్రబాబుకు మద్దతు ఇచ్చిన శ్రవణ్‌ కళ్యాణ్‌ పాత్ర ఏంటి?..2019 ఎన్నికల్లో ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు? తర్వాత శ్రవణ్‌ కల్యాణ్‌ పన్నిన వ్యూహం ఏంటి? అతన్ని ఇంద్రబాబు ఎలా వాడుకున్నాడు? అనేది మిగిలిన కథ.

టెక్నికల్ టీం పనితీరు :  దర్శకుడు రాంగోపాల్ వర్మ అనాలసిస్ అందరిలా ఉండదు. పైకి కనిపించేదాన్ని అతను నమ్మడు. దాని వెనుక ఉన్న మర్మాన్ని ముందే పసిగట్టగల సత్తా ఉన్న దర్శకుడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెడతాడు అని ముందుగా చెప్పింది వర్మనే? అతను చెప్పినట్టే పవన్ పార్టీ పెట్టాడు. జగన్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు అని ముందుగా చెప్పింది వర్మనే. అతని ఆలోచనా శైలిని అర్ధం చేసుకునే వారికి ‘వ్యూహం’ సరికొత్తగా కనిపిస్తుంది. జగన్ కి ఎదురైన సమస్యలు, అతను నిలదొక్కుకున్న తీరుని వర్మ చాలా బాగా వివరించాడు. ‘వ్యూహం’ లో జగన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు అనే ప్రయాణాన్ని చూపించాడు. ‘శపథం’ లో 2024 లో ఏ పార్టీ గెలుస్తుందనేది కూడా రాంగోపాల్ వర్మ చూపించే అవకాశాలు ఉన్నాయని ‘వ్యూహం’ ద్వారా స్పష్టం చేశాడు. రాంగోపాల్ వర్మ సినిమా అంటే సాంకేతికంగా చాలా క్వాలిటీగా ఉంటుంది అనే నమ్మకం జనాల్లో ఉంది. వ్యూహం కూడా అదే స్థాయిలో ఉంది.

ఎవరెలా చేసారంటే : వైఎస్‌ జగన్‌ పాత్రలో అజ్మల్ అమీర్ ఒదిగిపోయాడు. జగన్‌  మ్యానరిజాన్ని పర్‌ఫెక్ట్‌గా ఓన్ చేసుకుని ప్రెజెంట్ చేశాడు. అతని నటన ఇంప్రెస్ చేస్తుంది.వైఎస్‌ భారతి గారి పాత్రలో మానస రాధాకృష్ణన్ బాగా సూట్ అయ్యింది. సినిమాలో ఆమె కనిపించిన ప్రతిసారి అచ్చం భారతిలాగే ఉన్నారు అని అందరూ అనుకుంటారు. చంద్రబాబు పాత్రలో కనిపించిన ధనంజయ్ ప్రభునే నిజంగా చంద్రబాబులా సెట్ అయ్యాడు.  సోనియా గాంధీ పాత్రలో ఎలీనా కూడా సూపర్ గా సెట్ అయ్యింది. మిగిలిన నటీనటులు బాగానే చేశారు.

చివరి మాట : రాంగోపాల్ వర్మ ‘వ్యూహం’ ని మలిచిన తీరు బాగుంది. తన మార్క్ టేకింగ్ తో కట్టిపడేసాడు. కచ్చితంగా దీనిని థియేటర్లలో చూసి తీరాల్సిందే.

రేటింగ్ : 3/5

 

Read more : priyamani : ప్రియమణితో 4 ఏళ్ళు ఎఫైర్ నడిపిన హీరో ఎవరో తెలుసా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *