virupaksha movie review

‘విరూపాక్ష’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Reviews

విడుదల తేదీ : ఏప్రిల్ 21, 2023
నటీనటులు : సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, అజయ్, అభినవ్ గోమఠం, సునీల్, యాంకర్ శ్యామల తదితరులు
దర్శకత్వం : కార్తీక్ దండు
సంగీతం : అజ‌నీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ : శాందత్
నిర్మాత : బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌
నిర్మాణ సంస్థ : ‘ఎస్వీసిసి’ ‘సుకుమార్ రైటింగ్స్’

‘చిత్రలహరి’ ‘ప్రతిరోజు పండగే’ ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకుని ఫామ్లోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. 2021 వ సంవత్సరంలో యాక్సిడెంట్ పాలవ్వడంతో కెరీర్లో చాలా గ్యాప్ వచ్చినట్టైంది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం రిలీజ్ అయినా.. ఆ విషయం అతనికి కూడా తెలిసుండదనే చెప్పాలి. అయితే కొంత గ్యాప్ తర్వాత అతను ‘విరూపాక్ష’ అనే సినిమా చేశాడు. ఈరోజు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ సినిమా ఎలా ఉందో.. ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి :

రుద్రవనం అనే ఓ ఊరు.. అక్కడ కొంతమంది అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం.. కొన్నాళ్ల తర్వాత ఆ ఊరికి తన తల్లితో వచ్చిన సూర్య.. అక్కడ ఓ అమ్మాయితో ప్రేమలో పడటం మరోపక్క.. అక్కడి చావులకు కారణాలేంటో తెలుసుకోవడం.. దాని వెనుక ఉన్న మిస్టరీని ఛేదించి ఊరిని.. వారి మూఢనమ్మకాల నుండి విడిపించడం అనేది మెయిన్ కథ. ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు, ఎదురైన ప్రమాదాలు.. ఏంటనేది తెరపై చూడాల్సిందే.

కథ చెప్పుకోవడానికి ఒకటి రెండు, లైన్లుగానే ఉంటుంది. కానీ ఆ లైన్ చుట్టూ రాసుకున్న కథనం, గ్రిప్పింగ్ నెరేషన్ కు, సంభాషణలకు దర్శకుడికి ఫుల్ మర్క్స్ వేసేయొచ్చు. ఇక సుకుమార్ స్క్రీన్ ప్లే కూడా ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది అని చెప్పొచ్చు. శాందత్ సినిమాటోగ్రఫీ కూడా హైలెట్ గా నిలిచింది అని చెప్పొచ్చు. అజనీష్ లోకనాథ్ తన స్థాయికి తగ్గ నేపధ్య సంగీతం సమకూర్చాడు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేశారు.

సాయి ధరమ్ తేజ్ .. తన ఆరోగ్యం పూర్తిగా కోలుకోకపోయినప్పటికీ ఎంతో కష్టపడి ఈ చిత్రంలో నటించాడు. అయితే మునుపటి ఎనర్జీ లెవెల్స్ అతనిలో లేవనే చెప్పాలి. విగ్ కూడా సెట్ అవ్వలేదు. చాలా కష్టపడి నటించాడు కాబట్టి కచ్చితంగా పాస్ మార్కులు వేసేయ్యొచ్చు. అతని పై ఏర్పడిన సింపతీ కూడా సినిమాలో తాను చేసిన తప్పులను లెక్కచేయదనే చెప్పాలి. ఇక హీరోయిన్ సంయుక్త మీనన్ గత మూడు చిత్రాలకంటే బెటర్ గా పెర్ఫార్మ్ చేసిందని చెప్పాలి. కొన్ని చోట్ల తన గ్లామర్ తో కూడా మాయ చేసింది. నచ్చావులే అనే పాటలో ఈమె క్లీవేజ్ అందాలు అందరినీ ఫిదా చేస్తాయని చెప్పొచ్చు. ఇక అజయ్ కు చాలా కాలం తర్వాత మంచి పాత్ర దొరికింది.ఆ పాత్రకు అతను న్యాయం చేశాడు అని చెప్పొచ్చు.

ఈ వీకెండ్ కు తప్పకుండా చూడాల్సిన థ్రిల్లింగ్ మూవీగా ‘విరూపాక్ష’ గురించి చెప్పుకోవచ్చు.

రేటింగ్ : 3/5

 

Read more : Dasara review : దసరా మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *