baby review : ‘బేబీ’ మూవీ రివ్యూ .. ఆనంద్ దేవరకొండ హిట్టు కొట్టాడా లేదా ?

Reviews News

విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ. తన మొదటి ప్రయత్నంగా ‘దొరసాని’ చేశాడు. ఈ సినిమాకి క్రిటిక్స్ అప్లాజ్ దక్కింది. ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే చిత్రం చేశాడు. ఇది నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత చేసిన ‘పుష్పక విమానం’ యావరేజ్ కాగా ‘హైవే’ మళ్ళీ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ‘బేబీ‘ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో తెలుసుకుందాం రండి :

 

కథ : వైష్ణవి(వైష్ణవి), ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) పక్క పక్క ఇళ్ళలో నివసిస్తూ ఉంటారు. ఒకే స్కూల్ కుడా. ఇక స్కూల్ డేస్ నుండీ వీళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అయితే ఆనంద్ టెన్త్ ఫెయిల్ అవ్వడంతో ఆటో నడుపుకుంటూ ఉంటాడు. అలాగే ఇంటర్ చదువుకుంటున్న తన వైష్ణవితో ప్రేమలో మునిగితేలుతుంటాడు. అయితే వైష్ణవి ఇంటర్ కంప్లేట్ చేసి .. బి.టెక్ లో జాయిన్ అవుతుంది. ఆ తర్వాత అక్కడి పాష్ లైఫ్ కి అలవాటు పడిపోయి.. ఆనంద్ ను దూరం పెడుతుంది. మరోపక్క విరాజ్(విరాజ్ అశ్విన్ ) తో రొమాన్స్ చేస్తూ కాలం గడుపుతుంటుంది. అయితే విరాజ్ ఈమెను వాడుకుని వదిలేయాలనుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? ఆనంద్ -వైష్ణవి కలుసుకున్నారా? లేక విడిపోయరా అన్నది తెరపై చూడాల్సిందే.

 

ఎవరెలా చేశారంటే  : వైష్ణవి చైతన్య నిస్సందేహంగా ఎక్కువ మార్కులు కొట్టేసింది. రాబోయే రోజుల్లో ఈ అమ్మాయి టాప్ ప్లేస్ కి చేరుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఆనంద్ దేవరకొండ తన గత సినిమాల కంటే ఇంప్రూవ్ అయ్యాడని చెప్పాలి. ఇతని గురించి చెప్పాలి అంటే ‘బేబీ’ కి ముందు.. ‘బేబీ’ కి తర్వాత అని చెప్పుకునేలా నటించాడు. విరాజ్ .. ఎప్పటిలానే పాష్ బాయ్ లా కనిపించి ఆకట్టుకున్నాడు.  నాగబాబు, సీత వంటి వారు తమ పాత్రలకి న్యాయం చేశారు.

 

టెక్నికల్ టీం వర్క్ : దర్శకుడు సాయి రాజేష్ ఇప్పటి యూత్ ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాసుకున్నాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు.. యూత్ లీనమైపోతారు అనడంలో అతిశయోక్తి లేదు. కథ పాతదే అయినా కథనంతో మెప్పించాడు. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఇంటర్వెల్ ను డిజైన్ చేసుకున్న తీరు కుడా ఆకట్టుకుంటుంది. అలాగే క్లైమాక్స్ కుడా బాగా డిజైన్ చేసుకున్నాడు. సంగీతం బాగా ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫి కుడా బాగుంది. నిర్మాత ఎస్.కె.ఎన్ కి సినిమా పై ఎంత ప్యాషన్ ఉంది అనేది ‘బేబీ’ తో మరోసారి ప్రూవ్ అయ్యింది. నిర్మాణ విలువలకు అతను ఎక్కడా లోటు పాట్లు చేయలేదు. కొంచెం లెంగ్త్ ఎక్కువైన ఫీలింగ్ మాత్రం అందరికీ కలుగుతుంది. కానీ అది పెద్ద కంప్లైంట్ లా అనిపించదు.

 

చివరి మాట : ‘బేబీ’ అందరికీ నచ్చే సినిమా అని చెప్పొచ్చు. అయితే యూత్ కి, మాస్ ఆడియన్స్ కి ఇంకా బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

 

రేటింగ్ : 3/5

 

Read more : pawan kalyan- roja :జగన్‌ని అన్నట్లు .. కేసీఆర్ ప్రభుత్వం గురించి మాట్లాడగలవా, మక్కెలిరగ్గొడతారు: పవన్‌పై రోజా ఫైర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *