Dasara review : దసరా మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Reviews

అంటే సుందరానికీ చిత్రం తర్వాత నాని నుండి వచ్చిన చిత్రం ‘దసరా’. ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పాటలు సినిమాకి మంచి బజ్ ను తీసుకొచ్చాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన చిత్రమిది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా కన్నడ హీరో దీక్షిత్ శెట్టి కూడా ఈ మూవీలో చాలా ముఖ్య పాత్ర పోషించాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ‘దసరా’… ఈరోజు తెలుగుతో పాటు తమిళ, హిందీ ,కన్నడ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయ్యింది. ‘ఎస్.ఎల్.వి.సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. సంతోష్ నారాయణ్ సంగీత దర్శకుడు. ఇక ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేర అలరించిందో ఇప్పుడో లుక్కేద్దాం రండి :

కథ : వీర్లపల్లి అనే ఊరు. అక్కడ సిల్క్ బార్ అనే మద్యం దుకాణం ఉంటుంది. అక్కడి జనాలు మద్యం లేకుండా బ్రతకలేని విధంగా ఉంటారు. సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మద్యపాన నిషేధం చేయడం వల్ల… అక్కడి జనాలు తమ ఊరికి ఏదో కరువొచ్చినట్టు ఫీలవుతారు. అలంటి సమయంలో అక్కడి రాజకీయ నాయకులు.. జనల బలహీనతలతో రాజకీయం మొదలుపెడతారు. ఆ సిల్క్ బార్ లోకి ఆ రాజకీయ నాయకుల కులస్థులు తప్ప ఇంకెవ్వరూ అందులో అడుగుపెట్టకూడదు అనే నిబంధన పెడతారు. ఇది ఒక కథ అనుకుంటే.. ఈ సిల్క్ బార్ కు తన స్నేహితుడు సూరిని(దీక్షిత్ శెట్టి) క్యాషియర్ గా పెట్టాలి అనుకుంటాడు ధరణి(నాని). దానికి కారణం వెన్నెల(కీర్తి సురేష్). అదెలా? వెన్నెల- సూరి – ధరణి ల మధ్య బంధం ఏంటి? అసలు సిల్క్ బార్ లోకి రాజకీయ నాయకుల కుటుంబాలు తప్ప ఇంకెవ్వరూ అడుగుపెట్టకూడదు అనే నిబంధన ఉన్నప్పుడు ధరణి తన స్నేహితుడు సూరిని ఎలా క్యాషియర్ ను చేయాలనుకుంటాడు.? ఈ విషయాలు తెలియాలంటే ‘దసరా’ చూడాల్సిందే.

కథ చాలా రొటీన్ గా ఉంటుంది. మనం సినిమా చూస్తున్నప్పుడు సుకుమార్ తెరకెక్కించిన ‘ఆర్య2 ‘ ‘రంగస్థలం’ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వంటి సినిమాలు గుర్తుకొస్తాయి. దర్శకుడు శ్రీకాంత్.. సుకుమార్ శిష్యుడు కాబట్టి ‘రంగస్థలం’ థీమ్ నే కొంచెం అటు, ఇటు మార్చేసి తీసిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా.. సెకండ్ హాఫ్ మొదటి 15 నిముషాలు పర్వాలేదు అనిపించినా.. ఆ తర్వాత మాత్రం సినిమా బోరింగ్ గా సాగుతుంది. మళ్ళీ క్లైమాక్స్ బాగానే ఉంటుంది.

నాని చాలా బాగా నటించాడు. అతను ఓ రకంగా వన్ మ్యాన్ షో చేసాడని చెప్పాలి. అతని తర్వాత ఎక్కువ పనిచేసింది ఎవరైనా ఉన్నారా అంటే అది కచ్చితంగా కెమెరామెన్ సత్యన్ సూర్యన్ అనే చెప్పాలి. సినిమాలో ప్రతి విజువల్ అద్భుతంగా ఉంటుంది. సంగీతం ఓకే. డైలాగులు అక్కడక్కడా బాగానే పేలాయి. వయొలెన్స్ కూడా విపరీతంగానే ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ అయితే అందరికీ చమటలు పట్టిస్తుంది.

సముద్ర ఖని పాత్రను సరైన విధంగా డిజైన్ చేయలేదు. అతని గురించి ఏమైనా చెప్పుకోవాలి అంటే అతని గెటప్ తప్ప మరొకటి ఏమీ లేదు. సాయి కుమార్ పాత్ర మొదట్లో హడావిడి చేసింది .. చివరికి అదో అయోమయం పాత్రలా మిగిలింది.

ఫైనల్ గా.. నాని ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ కోసం ‘దసరా’ ని కచ్చితంగా ఓసారి చూడొచ్చు.

రేటింగ్ 3/5

Read more: Manchu Viranica : లండన్ స్టోర్ హారోడ్స్‌ లో విరానిక మంచు “MAISON AVA” ప్రారంభం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *